కుప్పం నుంచి చంద్రబాబును గెంటేస్తారా..?

కుప్పంలో చంద్రబాబు కోటకు బీటలు కలిగేలా చేయాలని వైసీపీ తాజా వ్యూహంగా కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో మొదటి రౌండ్ ఓట్ల లెక్కిపులో చంద్రబాబు కాస్త వెనుకబడ్డ అంశం ఏపీ వ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. అదే ఇప్పుడు వైసీపీ నేతల మైండ్లో బాగా నాటుకుపోయింది. అది మొదలు.. కాస్త గట్టిగా ప్రయత్నిస్తే టీడీపీ అధినేత చంద్రబాబును ఓడించడం పెద్ద కష్టమేమీ కాదన్న ఆలోచనకు వచ్చేశారు. Also Read: చంద్రబాబు ఆర్థిక మూలాలు దెబ్బతీసే జగన్ అస్త్రమిదే? 2019 […]

Written By: NARESH, Updated On : November 30, 2020 1:15 pm
Follow us on

కుప్పంలో చంద్రబాబు కోటకు బీటలు కలిగేలా చేయాలని వైసీపీ తాజా వ్యూహంగా కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో మొదటి రౌండ్ ఓట్ల లెక్కిపులో చంద్రబాబు కాస్త వెనుకబడ్డ అంశం ఏపీ వ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. అదే ఇప్పుడు వైసీపీ నేతల మైండ్లో బాగా నాటుకుపోయింది. అది మొదలు.. కాస్త గట్టిగా ప్రయత్నిస్తే టీడీపీ అధినేత చంద్రబాబును ఓడించడం పెద్ద కష్టమేమీ కాదన్న ఆలోచనకు వచ్చేశారు.

Also Read: చంద్రబాబు ఆర్థిక మూలాలు దెబ్బతీసే జగన్ అస్త్రమిదే?

2019 ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ తర్వాత చంద్రబాబు పార్టీని నడిపించడానికి ముప్పతిప్పలు పడుతున్నారు. రాజకీయంగా చంద్రబాబుకి చెక్ పెట్టడానికి ఇదే సరైన టైం అని భావిస్తున్న వైసీపీ తన వ్యూహాలను సిద్ధం చేస్తోంది.

వైసీపీ ప్రభావం బలంగా ఉండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి మెజార్టీని కూడా ఇది ప్రభావితం చేసింది. కుప్పం నుంచి వరసగా ఏడోసారి గెలిచినా.. ఈసారి ఆయన మెజార్టీ బాగా తగ్గింది. దీంతో చంద్రబాబు మనస్తాపం చెందరట.

Also Read: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్

చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వరసగా ఏడోసారి విజయం సాధించి రికార్డు సృష్టించారు. సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి చంద్రమౌళిపై 29,993 మెజార్టీతో చంద్రబాబు విజయం సాధించారు. అయితే.. ఈసారి ఆయన మెజార్టీ మాత్రం బాగా తగ్గడం గమనార్హం. ప్రభుత్వ వ్యతిరేక పవనాల నేపథ్యంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంలోనూ ఆ ప్రభావం కనిపించింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం: ఏపీ పాలిటిక్స్

కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు 1989 నుంచి పోటీ చేస్తున్నారు. 1989, 1994, 1999, 2004, 2009, 2014లో గెలుపొంది డబుల్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. 2004లో 59,588 ఓట్ల ఆధిక్యం సాధించగా.. 2009లో మెజార్టీ స్వల్పంగా (46,066) తగ్గింది. తిరిగి 2014లో ఆధిక్యం స్వల్పంగా (47,121) పెంచుకున్నారు. తాజా ఎన్నికల్లో 29 వేల మెజార్టీతో సరిపెట్టుకున్నారు.

ఈ నియోజకవర్గంలో చంద్రబాబు వందల కోట్లతో డెవలప్ చేశాడు. కానీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు పరువు మంట గలిపారట ఓటర్లు. ఓటర్ల లో ఈ విధమైనా మార్పు వస్తుందని తాను కలలో కూడా భావించలేదని చంద్రబాబు మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి కుప్పం నుంచి చంద్రబాబును గెంటేస్తారా? ఆయనే వైదొలుగుతారా అన్నది ఆసక్తిగా మారింది.