https://oktelugu.com/

విద్యార్థులకు డీఆర్‌డీవో శుభవార్త.. ప్రతి నెలా 15 వేలు పొందే ఛాన్స్..?

ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థినులకు డీఆర్డీవో అదిరిపోయే శుభవార్త చెప్పింది. బీఈ, బీటెక్, ఎంటెక్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థినులకు డీఆర్డీవో స్కాలర్ షిప్ ఇవ్వనుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థినులు సంవత్సరానికి 15 వేల 500 రూపాయలు స్కాలర్ షిప్ పొందవచ్చు. అయితే ఈ స్కాలర్ షిప్ పొందాలంటే కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. నిబంధనలకు లోబడి అర్హులైన వారికి మాత్రమే డీఆర్డీవో స్కాలర్ షిప్ అందిస్తోంది. Also Read: నిరుద్యోగులకు ఐఓసీఎల్ శుభవార్త.. రూ.లక్ష వేతనంతో ఉద్యోగాలు..? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 23, 2020 / 05:57 PM IST
    Follow us on


    ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థినులకు డీఆర్డీవో అదిరిపోయే శుభవార్త చెప్పింది. బీఈ, బీటెక్, ఎంటెక్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థినులకు డీఆర్డీవో స్కాలర్ షిప్ ఇవ్వనుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థినులు సంవత్సరానికి 15 వేల 500 రూపాయలు స్కాలర్ షిప్ పొందవచ్చు. అయితే ఈ స్కాలర్ షిప్ పొందాలంటే కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. నిబంధనలకు లోబడి అర్హులైన వారికి మాత్రమే డీఆర్డీవో స్కాలర్ షిప్ అందిస్తోంది.

    Also Read: నిరుద్యోగులకు ఐఓసీఎల్ శుభవార్త.. రూ.లక్ష వేతనంతో ఉద్యోగాలు..?

    ఇప్పటికే డీఆర్డీవో స్కాలర్ షిప్ కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా డిసెంబర్ 31 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://rac.gov.in/cgibin/2020/advt_ardb02/ వెబ్ సైట్ ద్వారా ఆసక్తి ఉన్న విద్యార్థినులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డీఆర్డీవో గేట్, జేఈఈ విద్యార్థినులు 30 మందికి, బీఈ బీటెక్ చదివే విద్యార్థినులు 20 మందికి స్కాలర్ షిప్ లభిస్తుంది.

    Also Read: రాత పరీక్ష లేకుండా బ్యాంక్ ఉద్యోగాలు.. రూ.60 వేల వేతనంతో..?

    బీఈ, బీటెక్ విద్యార్థులు సంవత్సరానికి 1,20,000 రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాలు ఈ స్కాలర్ షిప్ పొందవచ్చు. ఎం.ఈ , ఎంటెక్ విద్యార్థినులు మాత్రం రెండేళ్ల పాటు ఈ స్కాలర్ షిప్ ను పొందవచ్చు. డీఆర్డీవో వెబ్ సైట్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. అయితే దరఖాస్తు చేసుకున్న అందరూ స్కాలర్ షిప్ కు అర్హత పొందలేరు.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    మెరిట్ తో పాటు ఇతర అర్హతల ఆధారంగా విద్యార్థినుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆసక్తి ఉన్న విద్యార్థినులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డీఆర్డీవో ప్రతి సంవత్సరం ఈ స్కాలర్ షిప్ ల ద్వారా ప్రతిభ గల విద్యార్థినులు ఉన్నత చదువులు చదవడానికి సహాయసహకారాలు అందిస్తోంది.