
నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 28న కలెక్టరేట్‌ల వద్ద జనసేన ధర్నాలు చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ ప్రకటించారు. రైతులకు పరిహారంగా రూ.35 వేలు అందించాలని తక్షణ సాయంగా పది వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 28న కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ను కలిసి పవన్ వినతిపత్రం ఇవనున్నారు. గతంలో ఎన్నడూ నేని విధంగా పకృతి విపత్తులలో రైతులు దెబ్బతిన్నారని జనసేన నాదెండ్ల మనోహర్ తెలిపారు. 17 లక్షల 30 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని రైతులును ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.