నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ మేనేజర్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. నోటీఫికేషన్ ద్వారా డిప్యూటీ మేనేజర్ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినేషన్, సర్టిఫైడ్ మేనేజ్ మెంట్ అకౌంట్, సీఏ, బ్యాచిలర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.
కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. పరీక్ష పార్ట్1, పార్ట్2 పేపర్లలో మొత్తం 100 ప్రశ్నలు ఉండగా మెరిట్ మార్కులు సాధించిన అభ్యర్థులను మాత్రమే ఉద్యోగ ఖాళీల కొరకు ఎంపిక చేయడం జరుగుతుంది. జనరల్ అభ్యర్థులకు 500 రూపాయలు దరఖాస్తు ఫీజు కాగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 300 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండనుందని తెలుస్తోంది.
ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు 56,100 రూపాయల నుంచి 1,77,500 రూపాయల వరకు వేతనం లభించనుంది. 2021 సంవత్సరం నవంబర్ నెల 29వ తేదీ ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా ఉండనుందని సమాచారం. https://nhai.gov.in/#/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Deputy manager jobs in nhai with a salary of lakhs
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com