https://oktelugu.com/

నిరుద్యోగులకు కాగ్నిజెంట్ శుభవార్త.. ఏకంగా 23,000 ఉద్యోగాలు..?

కరోనా మహమ్మారి విజృంభణ వల్ల వేల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. కొత్త ఉద్యోగాల కోసం ఇప్పటికే ఉద్యోగాలు చేసిన అనుభవం ఉన్నవాళ్లతో పాటు, డిగ్రీ పీజీలు పూర్తి చేసి బయటకు వచ్చిన వాళ్లు సైతం ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో కాగ్నిజెంట్‌ కంపెనీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏకంగా 23,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు కల్పిస్తామని కీలక ప్రకటన చేసింది. Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్యూ ద్వారా సెయిల్‌‌ లో ఉద్యోగాలు..? ఇంత భారీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 10, 2020 / 07:23 PM IST
    Follow us on


    కరోనా మహమ్మారి విజృంభణ వల్ల వేల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. కొత్త ఉద్యోగాల కోసం ఇప్పటికే ఉద్యోగాలు చేసిన అనుభవం ఉన్నవాళ్లతో పాటు, డిగ్రీ పీజీలు పూర్తి చేసి బయటకు వచ్చిన వాళ్లు సైతం ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో కాగ్నిజెంట్‌ కంపెనీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏకంగా 23,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు కల్పిస్తామని కీలక ప్రకటన చేసింది.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్యూ ద్వారా సెయిల్‌‌ లో ఉద్యోగాలు..?

    ఇంత భారీ సంఖ్యలో ఈ మధ్య కాలంలో ఇతర సాఫ్ట్ వేర్ కంపెనీలు నియామకాలు చేపట్టలేదు. బీటెక్ లో సీఎస్సీ, ఈసీఈ, ఐటీ చదివిన అభ్యర్థులు కాగ్నిజెంట్ లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉండటంతో సులభంగా ఉద్యోగం లభించే అవకాశాలు ఉంటాయి. 2021లో కాగ్నిజెంట్ సంస్థ ఉద్యోగాల భర్తీని చేపట్టనుంది. ఇంజనీరింగ్‌, సైన్స్‌, మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లకు కాగ్నిజెంట్ ఎక్కువగా అవకాశాలు ఇస్తోంది.

    Also Read: పరీక్ష లేకుండా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. వారికి మాత్రమే..?

    కాగ్నిజెంట్ సంస్థ ఛైర్మన్, ఎండీ రాహుల్ నంబియార్ మాట్లాడుతూ యూనివర్సిటీ, ఇతర విద్యాసంస్థల ద్వారా ఫ్రెషర్లను కంపెనీలో నియమించుకోనున్నట్టు తెలిపారు. కాగ్నిజెంట్ కంపెనీ ఈ సంవత్సరం కాలేజీలు, యూనివర్సిటీల నుంచి 17,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనుందని తెలుస్తోంది. కాగ్నిజెంట్ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 70 శాతం ఉద్యోగులు భారత కార్యాలయాల్లోనే పని చేస్తున్నారు.

    మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం

    కాగ్నిజెంట్ ఇతర కంపెనీలతో పోలిస్తే మెరుగైన వేతనాలను కూడా ఇస్తూ ఉండటం గమనార్హం. నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా కాగ్నిజెంట్ సంస్థ నిర్ణయం తీసుకోవడంపై కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.