https://oktelugu.com/

తెలుగు హీరోలకు నిరాశ.. ‘కియారా’కి మరో క్రేజీ ఆఫర్ !

బాలీవుడ్ లో ఓ రేంజ్ లో తన హవా చూపిస్తోంది క్రేజీ హీరోయిన్ ‘కియారా అద్వానీ’. తక్కువ టైంలోనే పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోయిన్ గా ఫుల్ పాపులారిటీ తెచ్చుకోవడంతో ఈ బ్యూటీ కోసం అన్ని ఇండస్ట్రీల నుండి స్టార్ హీరోస్ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో మహేష్ దగ్గర నుండి విజయ్ దేవరకొండ వరకూ చాలామంది తెలుగు హీరోలు, కియారా కోసం వెయిటింగ్ లో ఉన్నారు. కానీ కియారా అద్వానీ ఇక ఇప్పట్లో […]

Written By:
  • admin
  • , Updated On : December 10, 2020 / 07:21 PM IST
    Follow us on


    బాలీవుడ్ లో ఓ రేంజ్ లో తన హవా చూపిస్తోంది క్రేజీ హీరోయిన్ ‘కియారా అద్వానీ’. తక్కువ టైంలోనే పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోయిన్ గా ఫుల్ పాపులారిటీ తెచ్చుకోవడంతో ఈ బ్యూటీ కోసం అన్ని ఇండస్ట్రీల నుండి స్టార్ హీరోస్ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో మహేష్ దగ్గర నుండి విజయ్ దేవరకొండ వరకూ చాలామంది తెలుగు హీరోలు, కియారా కోసం వెయిటింగ్ లో ఉన్నారు. కానీ కియారా అద్వానీ ఇక ఇప్పట్లో టాలీవుడ్ కి వచ్చేలా కనిపించడం లేదు. తెలుగు హీరోలకు నిరాశ తప్పదు. ఆమెకి బాలీవుడ్ లో వరుసగా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే అక్షయ్ కుమార్ వంటి పెద్ద హీరో సరసన నటించిన ఈ టాల్ బ్యూటీ.. ఇప్పుడు తాజాగా ఏకంగా హృతిక్ రోషన్ తో రొమాన్స్ చేయడానికి రెడీ కాబోతుంది.

    Also Read: ఆ హీరోయిన్ కే ‘నాని’ ఛాన్స్.. ఎందుకంటే !

    అసలు హృతిక్ పక్కన ఆటాపాటా ఆడేందుకు చాలామంది స్టార్ హీరోయిన్లు క్యూలో ఉన్నా.. ఈ అవకాశం కియారాకి దక్కింది. ఇంతకీ ఆమె ఏ సినిమాలో నటిస్తోంది అంటే… హృతిక్ రోషన్ హీరోగా ఆయన తండ్రి రాకేష్ రోషన్ “క్రిష్ 4” అనౌన్స్ చేసిన సినిమాలోనే కియారా తన అందచందాలతో అలరించనుంది. నిజానికి, ఈ సినిమాలో మొదట కృతి సనాన్ ని అప్రోచ్ అయ్యారని, కానీ ఆ భామ ఇప్పటికే ఐదు కొత్త సినిమాలు సైన్ చేయడంతో.. ఈ భారీ సీక్వెల్ కోసం ఆమె డేట్స్ కేటాయించడం కుదరకపోవడంతో.. మొత్తానికి కియారాకి ఆ అదృష్టం దక్కింది. ఇప్పటికే కియారాకి అడ్వాన్స్ కూడా ఇచ్చి ఆమెను లాక్ చేశారట నిర్మాతలు.

    Also Read: ప్రభాస్ కి అమ్మగా ఒకప్పటి హాట్ బ్యూటీ !

    కాగా “క్రిష్ 4” సినిమాని ఇప్పటికే మొదలు పెట్టాలి, కాకపోతే కొన్ని కారణాల వల్ల సినిమా పోస్ట్ ఫోన్ అవుతూ వస్తోంది. అయితే జనవరి నుండి ఎట్టిపరిస్థితుల్లో ఈ సినిమాని స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కరోనా సంక్షోభం ఉన్నా.. తగిన జాగ్రత్తలతో షూటింగ్ ను పూర్తి చేయాలని అన్ని రకాలుగా షూటింగ్ కోసం తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారట. ఇక “వార్” సినిమాతో బాక్సాఫిస్ ని షేక్ చేసిన హృతిక్ రోషన్, ఇప్పుడు “క్రిష్ 4″తో మరో బ్లాక్ బస్టర్ కోసం సన్నద్ధం అవుతున్నాడు అన్నమాట. మరి ఈ సినిమా కియారా అద్వానీకి ఏ రేంజ్ బూస్ట్ ఇస్తోందో చూడాలి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్