ఇంతకు విజయశాంతి కేసీఆర్ ను తిట్టిందా.. పొగిడిందా?

సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి ఇటీవలే కాషాయతీర్థం పుచ్చుకున్నారు. విజయశాంతి రాజకీయ ప్రస్థానం బీజేపీ నుంచే ప్రారంభమైంది. అయితే అనివార్య కారణాలతో ఆమె బీజేపీని వీడి కొన్నాళ్లు టీఆర్ఎస్.. కాంగ్రెస్ లోనూ పని చేశారు. ఇటీవలీ కాలంలో తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మారుతుండటంతో విజయశాంతి సైతం కాంగ్రెస్ ను వీడి తన మాతృ పార్టీలోకి చేరిపోయారు. Also Read: పెద్దాయన సీఎం ఆశలు మాత్రం చావడం లేదుగా..! బీజేపీలోకి చేరిన తర్వాత విజయశాంతి […]

Written By: Neelambaram, Updated On : December 10, 2020 7:59 pm

vijayashanthivijayashanthi

Follow us on

సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి ఇటీవలే కాషాయతీర్థం పుచ్చుకున్నారు. విజయశాంతి రాజకీయ ప్రస్థానం బీజేపీ నుంచే ప్రారంభమైంది. అయితే అనివార్య కారణాలతో ఆమె బీజేపీని వీడి కొన్నాళ్లు టీఆర్ఎస్.. కాంగ్రెస్ లోనూ పని చేశారు. ఇటీవలీ కాలంలో తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మారుతుండటంతో విజయశాంతి సైతం కాంగ్రెస్ ను వీడి తన మాతృ పార్టీలోకి చేరిపోయారు.

Also Read: పెద్దాయన సీఎం ఆశలు మాత్రం చావడం లేదుగా..!

బీజేపీలోకి చేరిన తర్వాత విజయశాంతి తొలిసారి పార్టీ కార్యాలయానికి వచ్చేసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై తనదైన శైలిలో కౌంటర్లు.. సైటర్లు వేశారు. టీడీపీలో మంత్రి పదవీ ఇవ్వలేదని అక్కసుతో తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణ ప్రజల రక్తం కూడును తింటూ.. అమరవీరుల శవాలపై పాలన సాగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాఖీ కట్టిన చెల్లెళ్ళకు లక్ష రూపాయలు ఇవ్వలేని కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఆరున్నరేళ్లలో లక్ష కోట్ల కంటే ఎక్కువగానే సంపాదించారని ఆరోపించారు. కేసీఆర్ కు ప్రజల సంక్షేమంపై శ్రద్ధ ఉంటే వరద బాధితులకు పూర్తిస్థాయిలో ఎందుకు సాయం చేయలేదని నిలదీశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో తన కుటుంబం నుంచి ఎవరినీ రాజకీయాల్లోకి తీసుకురానన్న కేసీఆర్ ప్రస్తుతం కుటుంబ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. గతంలో తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని సోనియాగాంధీకి హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ తర్వాత మాట తప్పారని గుర్తుచేశారు.

Also Read: టీపీసీసీ అధ్యక్ష పదవిపై వీడని ఉత్కంఠ.. పదుల సంఖ్యలో ఆవావహులు..

తాను తెలంగాణ కోసం 1998 నుంచి పోరాటం చేశానని అప్పుడు కేసీఆర్ ఎక్కుడున్నారో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. తాను స్థాపించిన తల్లి తెలంగాణ పార్టీని కేసీఆర్ పథకం ప్రకారంగానే టీఆర్ఎస్ విలీనం చేసుకున్నారని ఆరోపించారు. అదేవిధంగా తనను రాజకీయాల్లోని తప్పించాలని ఎన్నో విధాలుగా ప్రయత్నిచారని విమర్శించారు.

తాను సినిమాల్లో మాత్రమే నటినని.. అయితే కేసీఆర్ రాజకీయాల్లో గొప్ప నటుడని కితాబిచ్చారు. తాను అప్పట్లో బీజేపీ వీడేందుకు చంద్రబాబు నాయుడు కూడా ఓ కారణమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్.. కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందని ఇందుకు ఎవరు సూత్రధారో ప్రజలే అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ కాలం వెళ్లదీసిన కేసీఆర్ పతనం మొదలైందని హెచ్చరించారు. భవిష్యత్ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని విజయశాంతి జోస్యం చెప్పారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్