నిరుద్యోగులకు శుభవార్త.. షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థల నుంచి ఈ మధ్య కాలంలో వరుస నోటిఫికేషన్లు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కొచ్చిన్ షిప్‌యార్డ్‌ నుంచి 62 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే షిప్ యార్డ్ లో ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం జనవరి 15వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది. https://cochinshipyard.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. Also Read: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. […]

Written By: Navya, Updated On : January 5, 2021 2:20 pm
Follow us on

కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థల నుంచి ఈ మధ్య కాలంలో వరుస నోటిఫికేషన్లు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కొచ్చిన్ షిప్‌యార్డ్‌ నుంచి 62 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే షిప్ యార్డ్ లో ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం జనవరి 15వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది. https://cochinshipyard.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.

Also Read: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. డబ్బులు వచ్చాయో లేదో ఎలా చెక్ చేయాలంటే..?

ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్లూడీ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. ఓబీసీ, జనరల్ అభ్యర్థులు మాత్రం 300 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం 62 ఖాళీలలో షిప్ డ్రాఫ్ట్స్‌మెన్ ట్రెయినీ మెకానికల్ ఖాళీలు 48, షిప్ డ్రాఫ్ట్స్‌మెన్ ట్రెయినీ ఎలక్ట్రికల్ ఖాళీలు 14 ఉన్నాయి.

Also Read: డిప్లొమా పాసైన వాళ్లకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

2021 సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీఅడబ్ల్యూడీ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపులు ఉంటాయి. ఎస్ఎస్ఎల్‌సీ కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై మూడు సంవత్సరాల మెకానికల్ డిప్లొమా ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో మూడు సంవత్సరాల డిప్లొమా ఉన్నవాళ్లు షిప్ డ్రాఫ్ట్స్‌మెన్ ట్రెయినీ ఎలక్ట్రికల్ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు సీఏడీలో ప్రొఫిషియ‌న్సీతో పాటు డ్రాఫ్ట్స్‌మెన్‌షిప్‌ నైపుణ్యాలు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఫేజ్ 1, ఫేజ్ 2 పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 50 మార్కులకు ఫేజ్ 1 నిర్వహించి ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఫేజ్ 2 పరీక్షను నిర్వహించి అర్హులైన అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.