దేశంలో చాలామంది ఉదయం సమయంలో అల్పాహారం తినకుండా లంచ్ చేయడం లేదా అల్పాహారంలో పండ్లు తీసుకోవడం చేస్తూ ఉంటారు. పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే ఉదయం అల్పాహారానికి బదులుగా మాత్రం పండ్లను తీసుకోవదద్దని అలా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
Also Read: కొత్తిమీర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?
ఖాళీ కడుపుతో పండ్లను తినడం వల్ల శరీరానికి నష్టమే తప్ప లాభం ఉండదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఉదయం సమయంలో అరటిపండు తినకూడదని ఒకవేళ తింటే వాంతులు, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం సమయంలో టమోటా పండ్లను తినకూడదని టమోటా పండ్లను తీసుకుంటే గ్యాస్ సమస్య వేధించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
Also Read: ఖర్జూరం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
ఉదయం సమయంలో సలాడ్ ను కూడా తినకూడదని సలాడ్ ను తీసుకుంటే గుండెలో మంట సమస్య వేధించే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కివి, నారింజ, నిమ్మ, ఇతర సిట్రస్ జాతి పండ్లను తీసుకుంటే కూడా ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉందని సమాచారం. సిట్రస్ జాతి పండ్లలో ఆసిడ్స్ ఎక్కువగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఉదయం సమయంలో కూల్ డ్రింక్ తాగినా పండ్ల రసాలు తాగినా కూడా సమస్యలు తప్పవని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ లో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎన్ని పనులు ఉన్నా కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ చేసే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, పిండి పదార్థాలు లభించడంతో పాటు రోజంతా హుషారుగా ఉండే అవకాశం ఉంటుంది.