HCL Healthcare: సమయంతో సంబంధం లేకుండా నిత్యం పనిలో నిమగ్నమయ్యే జాబ్ ఐటీ కొటువు. ఫిజికల్‌గా స్ట్రెయిన్ లేకపోయినా మెంటల్‌గా చాలా ఒత్తిడి ఉంటుంది. వేతనాలు ఎక్కువగా ఉండడంతో చాలా మంది సాఫ్ట్‌వేర్ జాబ్‌పై ఆసక్తి చూపుతున్నారు. దేశంలోని కంపెనీలతోపాటు విదేశీ కంపెనీల్లోనూ పనిచేస్తున్నారు. అయితే ఐటీ కొలువు చేస్తున్నవారిలో చాలా అనారోగ్య సమస్యలు పొంచి ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది. జీవన శైలి కారణంగా టెకీలు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బారిన పడుతున్నారని హెచ్‌సీఎల్ హెల్త్‌కేర్ పరిశోధకులు గుర్తించారు.
77 శాతం మందికి వ్యాధులు..
హెచ్‌సీఎల్ హెల్త్ కేర్ సంస్థ దేశవ్యాప్తంగా 56 వేల మంది ఐటీ ఉద్యోగులకు మెడికల్ టెస్టులు నిర్వహించింది. ఇందులో 77 శాతం మందికి వ్యాధులు ఉన్నట్లు గుర్తించారు. 22 శాతం మందికి ఊబకాయం, 17 శాతం మందికి ప్రీ డయాబెటిస్, 11 శాతం మందికి రక్తహీనత ఉన్నట్లు గుర్తించారు.
వ్యాధులకు కారణీలు ఇవీ..
ఇక టెకీలలో అనారోగ్య సమస్యలకు కారణాలను కూడా పరిశోధకులు గుర్తించారు. జీవన శైలిలో మార్పు కారణంగానే సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించారు. జంక్ ఫుడ్, గంటలకొద్దీ కదలకుండా కూర్చోవడం, సరైన డైట్ పాటించకపోవడం, నిద్రలేమి, ఆల్కహాల్, స్మోకింగ్ అలవాట్ల కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించారు. చాలా మంది సంతాన లేమి సమస్యతో కూడా బాధపడుతున్నట్లు తెలిపారు.
ఒకరికి మూడు వ్యాధులు..
ఇక 30 ఏళ్ల వయసు ఉన్న ఐటీ ఉద్యోగుల్లో సంతాన లేమితోపాటు కనీసం మూడు వ్యాధులతో బాధపడుతున్నట్లుల గుర్తించారు. ఎక్కువ మందిలో మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ట్రైగ్లిజరైడ్, లిపోప్రొటీన్ అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. సాధారణ పనిదినంలో 8 గంటలకుపైగా కూర్చొని ఉండడం వలన శారీరక శ్రమ తగ్గిందని తెలిపారు. 22 శాతం మంది 150 నిమిషాలపాటు సిఫారసుఏ చేసిన శ్రమను కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఎక్కువ మందిలో అనారోగ్యానికి ఆహారపు అలవాట్లు కూడా కరణంగా పరిశోధకులు తేల్చారు.