Sasirekha Song Promo: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు'(Mana Shankar Varaprasad Garu) చిత్రం పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్ ని ఎంచుకోవడం, అది కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి దరక్షత్వం లో తెరకెక్కడం వంటివి ఈ చిత్రం పై ఇంతటి అంచనాలు ఏర్పడడానికి కారణం అయ్యాయి. అంతే కాకుండా రీసెంట్ గా రిలీజ్ చేసిన ‘మీసాల పిల్ల’ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ అవ్వడం ఈ చిత్రానికి మరింత హైప్ ని క్రియేట్ చేయడం లో సక్సెస్ అయ్యింది. ఇకపోతే కాసేపటి క్రితమే ఈ సినిమా నుండి రెండవ పాట ‘శశిరేఖ’ కి సంబంధించిన వీడియో ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో కి ఫ్యాన్స్ నుండి డివైడ్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ ప్రోమో సాంగ్ విన్నప్పుడు ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం నుండి ‘కచ్చాయని..భోంచేసావా’ పాట గుర్తొచ్చింది అని అంటున్నారు. అయితే కేవలం ఒక్క బీట్ ని విని పాట ఎలా ఉంటుంది అనేది అంచనా వెయ్యలేం. వోకల్స్ ముగిసిన తర్వాత వచ్చే బీట్ అదిరిపోయింది. కాబట్టి పూర్తి పాట వచ్చే వరకు ఎదురు చూడడం బెటర్ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కచ్చితంగా భీమ్స్ మరో చార్ట్ బస్టర్ ని అందిస్తాడని, ‘మీసాల పిల్ల’ పాటని మించి పెద్ద హిట్ అవుతుందని కొంతమంది బలంగా నమ్ముతున్నారు. మరి ఆ రేంజ్ హిట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే డిసెంబర్ 8 వరకు ఆగాల్సిందే. అదే రోజున పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి సంబంధించిన ప్రోమో ని కూడా విడుదల చేస్తారని అంటున్నారు. అంటే ఒకే రోజు మెగా ఫ్యాన్స్ కి అన్నదమ్ముల నుండి ట్రీట్ రాబోతుంది అన్నమాట. చూడాలి మరి ఎవరి పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది అనేది.
Let’s celebrate the MEGA CLASS of #ManaShankaraVaraPrasadGaru with #Sasirekha
Song Promo out now
Full Lyrical Video on December 8th ❤️— https://t.co/EBGOtY0rlZ #ChiruANIL ~ #MSG Sankranthi 2026 RELEASE. pic.twitter.com/PMfZiI4oSb
— Anil Ravipudi (@AnilRavipudi) December 6, 2025