https://oktelugu.com/

Jobs: హైద‌రాబాద్‌లో సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగ ఖాళీలు.. రూ.50 వేల వేతనంతో?

Jobs: రీజ‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ అర్బ‌న్ అండ్ ఎన్విరాన్‌మెంట‌ల్ స్ట‌డీస్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. హైదరాబాద్ లో ఉన్న ఈ సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధమైంది. భారత ప్ర‌భుత్వ గృహ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ‌కు సంబంధించిన ఈ సంస్థ కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. మొత్తం 4 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం. భారత ప్ర‌భుత్వ గృహ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ‌, రీజ‌న‌ల్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 17, 2022 / 08:49 AM IST
    Follow us on

    Jobs: రీజ‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ అర్బ‌న్ అండ్ ఎన్విరాన్‌మెంట‌ల్ స్ట‌డీస్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. హైదరాబాద్ లో ఉన్న ఈ సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధమైంది. భారత ప్ర‌భుత్వ గృహ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ‌కు సంబంధించిన ఈ సంస్థ కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. మొత్తం 4 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం.

    భారత ప్ర‌భుత్వ గృహ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ‌, రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్స్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మాస్ట‌ర్స్ డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. కంప్యూటర్ నైపుణ్యాలతో పాటు అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 50,000 రూపాయల వేతనం లభించనుంది.

    ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. రాత పరీక్ష‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. 2022 సంవత్సరం జనవరి 22వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉండనుందని సమాచారం. http://rcueshyd.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

    భారీ వేతనం లభిస్తుండటంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగానే ఉంటుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు జరగనుంది.