https://oktelugu.com/

HAL Recruitment: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ లో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

HAL Recruitment: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) నిరుద్యోగులకు తాజాగా మరో తీపికబురు అందించింది. హెచ్‌ఏఎల్‌ బెంగళూరులోని సంస్థలో వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు తాజాగా ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. స్టాఫ్‌ నర్స్‌, ఫిజియోథెరపిస్ట్‌, ఫార్మసిస్ట్‌, డ్రెస్సర్‌ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. జనరల్‌ నర్సింగ్, మెడ్‌వైఫరీలో డిప్లొమా పాసైన వాళ్లు స్టాఫ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 27, 2021 / 07:06 AM IST
    Follow us on

    HAL Recruitment: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) నిరుద్యోగులకు తాజాగా మరో తీపికబురు అందించింది. హెచ్‌ఏఎల్‌ బెంగళూరులోని సంస్థలో వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు తాజాగా ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. స్టాఫ్‌ నర్స్‌, ఫిజియోథెరపిస్ట్‌, ఫార్మసిస్ట్‌, డ్రెస్సర్‌ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

    HAL Recruitment

    జనరల్‌ నర్సింగ్, మెడ్‌వైఫరీలో డిప్లొమా పాసైన వాళ్లు స్టాఫ్ నర్స్ పోస్టుకు అర్హులు. 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. ఫిజియోథెరపీలో డిప్లొమా పూర్తి చేసిన వాళ్లు ఫిజియోథెరపిస్ట్‌ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. 28 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లే ఈ ఉద్యోగ ఖాళీలకు కూడా అర్హులని చెప్పవచ్చు. డీఫార్మసీ పూర్తి చేసిన వాళ్లు ఫార్మసిస్ట్‌ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    ప్రథమ చికిత్స విభాగంలో ట్రైనింగ్ పూర్తి చేసిన వాళ్లు డ్రెస్స్ర్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://hal-india.co.in/careers/m__206 వెబ్ సైట్ లింక్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: BSNL Recruitment: ఈసీఈ డిప్లొమా చదివిన వాళ్లకు శుభవార్త.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో జాబ్స్!

    ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు 15000 రూపాయల నుంచి 21,473 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.

    Also Read: Guntur DCCB Recruitment 2021: గుంటూరు డీసీసీబీలో ఉద్యోగ ఖాళీలు.. అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారంటే?