పదో తరగతి విద్యార్థులకు 80 మార్కులకే పరీక్ష.. కానీ..?

కరోనా మహమ్మారి విజృంభణ వల్ల 2020 – 2021 విద్యాసంవత్సరంలో పది, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో భారీ సంఖ్యలో పనిదినాలను నష్టపోయారు. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు సిలబస్ ను తగ్గించడంతో పాటు ప్రశ్నాపత్రాల్లో కీలక మార్పులు చేశాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ ఆన్ లైన్ ద్వారానే విద్యా భోదన కొనసాగుతోంది. Also Read: డిప్లొమా పాసైన వాళ్లకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ […]

Written By: Kusuma Aggunna, Updated On : January 5, 2021 11:37 am
Follow us on

కరోనా మహమ్మారి విజృంభణ వల్ల 2020 – 2021 విద్యాసంవత్సరంలో పది, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో భారీ సంఖ్యలో పనిదినాలను నష్టపోయారు. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు సిలబస్ ను తగ్గించడంతో పాటు ప్రశ్నాపత్రాల్లో కీలక మార్పులు చేశాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ ఆన్ లైన్ ద్వారానే విద్యా భోదన కొనసాగుతోంది.

Also Read: డిప్లొమా పాసైన వాళ్లకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

ఇలాంటి తరుణంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంచలన నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్థులకే 80 మార్కులకే పరీక్షలు నిర్వహించనున్నట్టు కీలక ప్రకటన చేసింది. మిగిలిన 20 మార్కులను ప్రభుత్వం విద్యార్థులకు నేరుగా కలనుండటం గమనార్హం. ఒడిశా సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

Also Read: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. డబ్బులు వచ్చాయో లేదో ఎలా చెక్ చేయాలంటే..?

అయితే ఈ నిర్ణయం ఒడిశా రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఎటువంటి ప్రయోజనం చేకూరదు. ఆ 80 మార్కుల్లో 50 అబ్జెక్టివ్ ప్రశ్నలు 50 మార్కులకు, 30 మార్కులకు డిస్క్రిప్టివ్ ప్రశ్నలు ఉంటాయని తెలుస్తోంది. ఈ ఏడాది మే నెల 3వ తేదీ నుంచి ఒడిశా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

దాదాపు 13 రోజుల పాటు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు జరిగిన నెలన్నర తరువాత ఫలితాలు వెలువడనున్నాయి. ఒడిశా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఇతర రాష్ట్రాలు సైతం అదే విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.