https://oktelugu.com/

రాజకీయాలను త్రివిక్రమ్-ఎన్టీఆర్ టార్గెట్ చేశారా?

‘ఆర్ఆర్ఆర్’ మూవీ ముగింపు దశకు వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమాను గూరూ జీ త్రివిక్రమ్ తో చేయనున్నాడు. ‘అల వైకుంటపురంలో’ సినిమాతో బంపర్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా కోసం రాజకీయాలను షేక్ చేసే కథ రాశారని సమాచారం. కరోనా లాక్ డౌన్ ఖాళీ సమయంలో త్రివిక్రమ్ అద్భుతమైన ఈ కథకు ప్రాణం పోశారని అంటున్నారు. Also Read: ‘రూమ్మేట్స్’ వెబ్ సిరీస్ ఎపిసోడ్-2.. వంటతో మంట పుట్టించారు! […]

Written By:
  • NARESH
  • , Updated On : January 4, 2021 / 08:09 PM IST
    Follow us on

    ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ముగింపు దశకు వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమాను గూరూ జీ త్రివిక్రమ్ తో చేయనున్నాడు. ‘అల వైకుంటపురంలో’ సినిమాతో బంపర్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా కోసం రాజకీయాలను షేక్ చేసే కథ రాశారని సమాచారం. కరోనా లాక్ డౌన్ ఖాళీ సమయంలో త్రివిక్రమ్ అద్భుతమైన ఈ కథకు ప్రాణం పోశారని అంటున్నారు.

    Also Read: ‘రూమ్మేట్స్’ వెబ్ సిరీస్ ఎపిసోడ్-2.. వంటతో మంట పుట్టించారు!

    త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా రాజకీయం సంచలనంగా ఉండబోతోందని.. మొత్తం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ గానే తీయబోతున్నారని టాలీవుడ్ సమాచారం. ఇప్పటికే వీరిద్దరూ తీసిన ‘అరవింద సమేత’ మూవీ హిట్ అయ్యింది. మరో చిత్రాన్ని కూడా రాజకీయంపై వదులుతుండడం ఆసక్తి రేపుతోంది.

    ఇప్పటికే వీరి సినిమాకు ‘అయిననూ పోయి రావలే హస్తినకు’ అనే టైటిల్ ను కూడా ఖాయం చేశారన్న ప్రచారం ఉంది. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, మలయాళ సీనియర్ యాక్టర్ జయరాం నటిస్తున్నారని సమాచారం. దీంతో ఈసినిమా ప్యాన్ ఇండియా లెవల్లో తీయబోతున్నారని అర్థమవుతోంది.

    Also Read: చెన్నకేశవ స్వామి ఆలయంలో బాలయ్య ఫైట్ సీక్వెన్స్ !

    ఆర్ఆర్ఆర్ తర్వాత ఎలాగూ ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా స్టార్ కావడం ఖాయమని ఆ కోవలోనే కథలో చాలా బలం ఉండేలా త్రివిక్రమ్ అద్భుతమైన లైన్ ను రాసుకున్నాడని టాక్. మరి త్రివిక్రమ్-ఎన్టీఆర్ చేయబోయే ఆ రాజకీయాలను కుదిపేసే సినిమా ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్