
బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఈ సంస్థ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. మొత్తం 99 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.
https://becil.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 99 ఉద్యోగ ఖాళీలు ఉండగా హ్యాండీమెన్/లోడర్ ఉద్యోగ ఖాళీలు 75, సూపర్‌వైజర్ ఉద్యోగ ఖాళీలు 21, సీనియర్ సూపర్‌వైజర్ ఉద్యోగ ఖాళీలు 3 ఉన్నాయి. ఎనిమిదో తరగతి పాస్ కావడంతో పాటు ఏడాది అనుభవం ఉన్నవాళ్లు హ్యాండీమెన్/లోడర్ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి 14,014 రూపాయలు వేతనంగా చెల్లిస్తారు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేకుకోవాల్సి ఉంటుంది. సూపర్ వైజర్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు 18,564 రూపాయలు చెల్లిస్తారు.
సీనియర్ సూపర్ వైజర్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి గ్రాడ్యుయేషన్ పాస్ కావడంతో పాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, సంబంధిత పనిలో రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు 20,384 రూపాయల వేతనం లభిస్తుంది.
పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగష్టు 8 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.