దర్శకుడు : లక్ష్మణ్ మేనేని
నిర్మాతలు : టి. వేణుగోపాల్ రెడ్డి, బి. కృష్ణా రెడ్డి & మిత్రులు,
కెమెరా : రఘు మందాటి,
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్,
సంగీతం : మోహిత్ రెహ్మానియాక్,
ఈ “మ్యాడ్”కు స్టార్ హీరోలు, హీరోయిన్ లు లేరు. కథా బలంతోనే విజయం సాధిస్తుందని మేకర్స్ తెగ డప్పు కొట్టారు. పైగా రాత్రి క్రిటిక్స్ కి ప్రత్యేక ప్రివ్యూ షో వేసి తలకు బొప్పి కట్టించారు. మరి మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
*కథాకమామీషుకి వస్తే..
మ్యాడీ (మాధవ్ చిలుకూరి) ఒక ప్లే బాయ్. అమ్మాయిలతో తిరుగుతూ ఎంజాయ్ చేయడమే అతని దినచర్య. కాకపోతే ఒక్కో సీన్ లో ఒక్కోలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అంటే.. సహజ తెలుగు సినిమా హీరోలా తిరుగులేని సేవలో నిమగ్నమవుతూ ఉంటాడు. ఇక మధ్య మధ్యలో అసభ్యకరమైన సీన్స్ తో నీరసం తెప్పిస్తూ ఉంటాడు. మాధురి (స్పందన పల్లి) ఈమెగారికి కూడా ఒక క్లారిటీ ఉండదు. ప్రేమ అంటే రెండు మనసులు కలవాలి, శరీరాలు కాదు అంటుంది. మరి అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకుందో ఆమెకే తెలియాలి.
మొత్తంగా పూర్తి వ్యతిరేక భావజాలం ఉన్న మ్యాడీకి మాధురికి పెళ్లి జరుగుతుంది. ఆపోజిట్ ఆలోచనలతో నిత్యం రగిలిపోయే ఈ జంట కాపురం ఎలా సాగింది ? ఇంతకీ మాధురి ఆలోచనలు ఎందుకు అలా ఉన్నాయి ? వీరిద్దరి మధ్యలో మ్యాడీ ఫ్రెండ్ అరవింద్ (రజత్ రాఘవ్), అఖిలా (శ్వేతవర్మ) బోల్డ్ ప్రేమ కథ ఎలా సాగుతూ ఏ స్థాయిలో విసిగించింది ? చివరకు ఈ రెండు జంటల ప్రేమకథలు ఎలా ముగిశాయి ? అనేది మిగిలిన బాగోతం.
*విశ్లేషణ :
ఈ సినిమా గురించి ఒక్క లైన్ లో చెప్పుకుంటే.. అనవసరమైన సన్నివేశాలు, బలం లేని కథ, బలహీనమైన కథనం, ఇక విసుగు మయంతో సాగే పాత్రలు, వాటి హావభావాలు, అర్ధం పర్ధం లేని బోల్డ్ సీన్స్, వీటికి తోడు అనవసరంగా ఇరికించిన ఎమోషనల్ సీన్స్ (దర్శకుడు ఒక్కడే ఎమోషనల్ అవుతాడు, ప్రేక్షకులు కాదు) మొత్తంగా ఇదొక దిగువస్థాయి బూతు సినిమా.
కాకపోతే హీరోగా నటించిన మాధవ్ చిలుకూరి ఈజ్ తో సెటిల్డ్ గా నటించి మెప్పించాడు. మరో హీరోగా నటించిన రజత్ రాఘవ్ నటన కూడా బాగుంది. హీరోయిన్స్ గా నటించిన స్పందన పల్లి ఒకే ఎక్స్ ప్రెషన్ తో సినిమా మొత్తం నెట్టుకొచ్చింది. శ్వేత వర్మకి నటించే స్కోప్ లేదు. అందుకే ఎప్పుడు ఎక్స్ పోజింగ్ చేద్దామా అని కాసుకొని కూర్చుంది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించే ప్రయత్నం చేసారు.
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు లక్ష్మణ్ మేనేని పరిపూర్ణంగా విఫలం అయ్యాడు. సంగీత దర్శకుడు మోహిత్ రెహ్మానియాక్ అందించిన సంగీతం బాగాలేదు. రఘు మందాటి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు.
* ప్లస్ పాయింట్స్ :
రెండు సాంగ్స్,
నటీనటుల నటన (అక్కడక్కడ మాత్రమే) ,
విజువల్స్,
* మైనస్ పాయింట్స్ ;
కథాకథనాలు,
సిల్లీ డ్రామా,
ఇంట్రెస్టింగ్ సాగని సీన్స్,
రెగ్యులర్ లవ్ కంటెంట్,
రొటీన్ నేరేషన్,
అన్నిటికీ మించి ఈ సినిమా దర్శకుడు పనితనం.
* సినిమా చూడాలా ? వద్దా ?
చూడకపోవడమే ఉత్తమైన పని. రొటీన్ రొట్ట కొట్టుడు ప్రేమ వ్యవహారాలతో సాగే ఈ తతంగాన్ని చూసి విసిగి వేసారి పోవద్దు అని మా మనవి.
oktelugu.com రేటింగ్ : 1.75
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Movie review mad boring and bold silly drama
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com