
బ్రిటన్ తో జరుగుతున్న కాంస్యపు పోరులో భారత హాకీ మహిళల జట్టు అదరగొడుతోంది. రెండో క్వార్టర్ వరకు బ్రిటన్ ఆధిక్యంలో కొనసాగగా.. వెంటనే తేరుకొని క్వార్టర్ ముగిసే సరికి రాణి రాంపాల్ సేన వరుస గోల్స్ చేసి 3-2 తో ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ రెండు, వందనా కటారియా ఒక గోల్ చేశారు.