నిరుద్యోగులకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా గుడ్ న్యూస్.. రూ.40 వేల వేతనంతో ఉద్యోగాలు..?

బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నెల 19 నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 8, 2021లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. www.bankofbaroda.in/careers.htm వెబ్ సైట్ లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 127 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ […]

Written By: Navya, Updated On : December 21, 2020 3:14 pm
Follow us on


బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నెల 19 నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 8, 2021లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. www.bankofbaroda.in/careers.htm వెబ్ సైట్ లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి.

Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 127 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..?

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32 ఉద్యోగాల భర్తీ జరగనుండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 40,000 రూపాయల వేతనం లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం 32 ఉద్యోగాలలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు 27 ఉండగా ఫైర్ ఆఫీసర్ ఉద్యోగాలు 5 ఉన్నాయి. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: ఎల్ఐసీ‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌‌లో ఉద్యోగాలు.. 14 లక్షల రూపాయల వేతనంతో..?

ఫైర్ ఆఫీసర్ ఉద్యోగాలకు మాత్రం బీటెక్ లో ఫైర్ టెక్నాలజీ చదివిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 600 రూపాయలుగా ఉండగా మిగిలిన వాళ్లకు 100 రూపాయలుగా ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

బ్యాంక్ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడంతో పాటు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. రిజర్వేషన్ల ఆధారంగా ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.