https://oktelugu.com/

APPSC: ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలు ప్రకటన.. ఏ పరీక్ష ఎప్పుడంటే..

APPSC ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ(APPSC) ద్వారా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కూటమి సర్కాన్‌ పోస్టుల భర్తీ విషయంలో తర్జనభర్జన పడుతోంది.

Written By: , Updated On : March 22, 2025 / 08:56 AM IST
APPSC

APPSC

Follow us on

APPSC: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) వివిధ పరీక్షల తేదీలను ప్రకటించింది. ఇప్పటికే పరీక్షల నిర్వహణ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు తేదీలు ఖరారు చేసింది.

గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్ష:
తేదీలు: మే 3 నుంyచి మే 9, 2025 వరకు
సమయం: ప్రతీ రోజు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు (ఒకే షిఫ్ట్‌)
వివరాలు: ఈ పరీక్షలో తెలుగు మరియు ఇంగ్లీష్‌ పేపర్లు క్వాలిఫైయింగ్‌ స్వభావం కలిగి ఉంటాయి. మిగిలిన పేపర్లు జనరల్‌ ఎస్సే, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వంటి అంశాలను కవర్‌ చేస్తాయి.

Also Read: జనసేనకు కౌంటర్.. వర్మ షాకింగ్ ట్వీట్!

జూనియర్‌ లెక్చరర్‌ పరీక్ష:
షెడ్యూల్‌ విడుదలైంది, కానీ నిర్దిష్ట తేదీలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేయాలి (psc.ap.gov.in)

టౌన్‌ ప్లానింగ్‌ సర్వీస్‌ పరీక్ష:
షెడ్యూల్‌ ప్రకటించబడింది, వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కంప్యూటర్‌ ప్రావీణ్య పరీక్ష:
తేదీలు: ఏప్రిల్‌ 12, 13
ప్రదేశాలు: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం

ఇతర పోస్టుల కోసం పరీక్షలు:
అసిస్టెంట్‌ డైరెక్టర్, లైబ్రేరియన్, అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ కెమిస్ట్‌ వంటి 8 పోస్టుల కోసం పరీక్షలు ఏప్రిల్‌ 27 నుంచి ఏప్రిల్‌ 30, 2025 వరకు నిర్వహించబడతాయి. ఈ పరీక్షలు విశాఖపట్నం, కృష్ణా, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో జరుగుతాయి.