ఏపీ కో ఆపరేటివ్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. భారీ వేతనంతో..?

ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 61 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలతో పాటు మేనేజర్‌ (స్కేల్‌-1) ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఇప్పటికే ఈ ఉదోగ ఖాళీల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.apcob.org/ వెబ్ సైట్ ద్వారా ఈ […]

Written By: Navya, Updated On : July 24, 2021 9:46 am
Follow us on

ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 61 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలతో పాటు మేనేజర్‌ (స్కేల్‌-1) ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఇప్పటికే ఈ ఉదోగ ఖాళీల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

https://www.apcob.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 61 ఉద్యోగ ఖాళీలలో మేనేజర్‌ (స్కేల్‌-1) ఉద్యోగ ఖాళీలు 26 ఉండగా స్టాఫ్ అసిస్టెంట్ల ఉద్యోగ ఖాళీలు 35 ఉన్నాయి. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మేన్ అభ్యర్థులకు 500 రూపాయలు, మిగిలిన అభ్యర్థులకు 700 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంటుంది.

ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు 2021 సంవత్సరం సెప్టెంబర్ మొదటి వారంలో పరీక్ష నిర్వహిస్తారు. ఆన్ లైన్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2021 సంవత్సరం జూన్ 1వ తేదీ నాటికి 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలకు 2021 సంవత్సరం జూన్ 1 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

40 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై తెలుగు, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.