Zodiac Signs: శనీశ్వరుడు అనగానే చాలామంది వణికిపోతూ ఉంటారు. ఒకసారి శనిపీడ పట్టిందంటే ఏడేళ్ల వరకు ఉంటుందని కొందరి భావన. శనీశ్వరుడు పట్టుకుంటే ఏ పని మొదలుపెట్టిన పూర్తి కాదు. ఆర్థిక సమస్యలు ఉంటాయి. కుటుంబంలో అనారోగ్యం ఉంటుంది.. అని కొందరు పండితులు చెబుతారు. వాస్తవానికి శనీశ్వరుడు కూడా దేవుడే. మనుషుల జీవితాలను సక్రమంగా చేయడానికి కొన్ని బాధలను పెడతాడు. వీటిని చూసి కొందరు భయపడి శనీశ్వరుడు అనగానే వణికిపోతారు. అయితే శని దేవుడు కొన్ని రాశుల్లో ప్రయాణించడం వల్ల మిగతా రాశులపై ప్రభావం పడుతుంది. వచ్చే ఉగాది నుంచి శనీశ్వరుడు కుంభ రాశిలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి మహర్దశ పట్టనుంది. మరి ఆ రాశులేవో చూద్దాం..
మార్చి 29 ఉగాది సందర్భంగా శనీశ్వరుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో మూడు రాశుల వారికి అదృష్టం వరించనుంది. వీటిలో మేషరాశి ఒకటి. మార్చి 29 నుంచి మేషరాశి వారికి అన్ని శుభాలే కలుగుతాయి. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరుగుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. పదోన్నతులు లభించే అవకాశం ఉంటుంది. విదేశాల నుండి శుభవార్తలు వింటారు. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అనుకోకుండా ప్రయాణాలు ఉంటాయి. దీంతో మనసు ఉల్లాసంగా మారుతుంది.
శనీశ్వరుడు స్థానం మార్చుకోవడం వల్ల ధనుస్సు రాశిపై కూడా ప్రభావం పడుతుంది. ఈ రాశి వారికి ఉగాది నుంచి అన్నీ కలిసి వస్తాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెడతారు. భాగస్వాములతో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారికి అధిక లాభాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అయితే పెట్టుబడులు పెట్టేముందు పెద్దల సలహా తీసుకోవాలి. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. వాహనాలపై ప్రయాణాలు చేసేవారు కేర్ తీసుకోవాలి. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
కర్కాటక రాశి వారికి ఉగాది నుంచి కొత్త జీవితం ప్రారంభం కాలేదు. ఈ రాశి వారు ఏ పని చేసిన విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలను విస్తరించుకుంటారు. దీంతో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే వెనుక ముందు ఆలోచించాలి. ఖర్చులు పెరుగుతాయి. అయితే పొదుపు చేయడం వల్ల కాస్త ఉపశమనం పొందుతుంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
ఉగాది నుంచి పై మూడు రాశుల వారు మాత్రమే కాకుండా మిగతా రాశుల వారు పై కూడా శని ప్రభావం ఉంటుంది. అయితే వారికి అనుకూలంగా ఉండాలంటే శనిదేవుడని ప్రసన్నం చేసుకోవాలి. ప్రతి శనివారం శని దేవుడికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు తైలంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల ఆ స్వామి అనుగ్రహం ఉంటే కొన్ని బాధల నుంచే విముక్తిని పొందవచ్చు.