Employees: నేటి కాలంలో ఉద్యోగులు చాలా Bank Account ను కలిగి ఉంటున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు కంపెనీ లేదా సంస్థ మారినప్పుడల్లా ఆ సంస్థ లేదా కంపెనీకి అనుగుణంగా అనుగుణంగా ఉండే బ్యాంక్ అకౌంటు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చాలామంది చాలా బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉన్నారు. అయితే అన్ని బ్యాంక్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయడం కుదరదు. దీంతో కొన్ని బ్యాంక్ అకౌంట్లను అలాగే వదిలేస్తూ ఉంటారు. అయితే కొన్నాళ్ల తర్వాత ఇవి చార్జీలు పెరిగినట్లు మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఇలా చార్జీలో పెరిగినట్లు మెసేజ్లు ఎందుకు వస్తాయి? ఎక్కువ అకౌంట్స్ఉంటే ఏం చేయాలి?
నగదు వ్యవహారాలు నడిపించేందుకు నేటి కాలంలో బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా మారింది. ఉద్యోగం చేసేవారు తమ జీతాన్ని మాన్యువల్ గా కాకుండా బ్యాంక్ అకౌంట్ ద్వారానే తీసుకుంటున్నారు. చిన్నపాటి సంస్థ నుంచి పెద్ద కంపెనీ వరకు సాలరీస్ బ్యాంక్ అకౌంట్ ద్వారా అని తమ ఉద్యోగులకు అందిస్తూ ఉంటాయి. అయితే సంస్థలు లేదా కంపెనీలో తమకు అనుగుణంగా ఉండే కొన్ని బ్యాంకులను ఎంచుకొని వాటి ద్వారానే ఆర్థిక వ్యవహారాలు జరుపుతూ… ఉద్యోగులకు జీతాలు కూడా ఆ బ్యాంకుల ద్వారానే అందిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఆ బ్యాంకుకు సంబంధించిన అకౌంట్లను కలిగి ఉండాలని పేర్కొంటూ ఉంటుంది. అయితే చాలామంది పలు కారణాలవల్ల ఉద్యోగాలు మారడం వల్ల కొత్త బ్యాంక్ అకౌంట్ లో తీసుకోవాల్సి వస్తుంది. ఇలా అనుకోకుండానే చాలా అకౌంట్లు కలిగి ఉండాల్సి వస్తుంది.
సాధారణంగా సాలరీ అకౌంట్ కు మినిమం బాలన్స్ లేకుంటే ఎలాంటి చార్జీలు ఉండవు. ఇందులో సాలరీ పడిన తర్వాత మొత్తం తీసేసిన ఎలాంటి రుసుమును వసూలు చేయరు. కానీ ఈ అకౌంట్ ను మూడు నెలల పాటు వాడకపోయినా లేదా ఇందులో మూడు నెలల పాటు సాలరీ పడకపోయినా ఆ అకౌంట్ సేవింగ్ అకౌంట్ కు మారిపోతుంది. ఇలా సేవింగ్ అకౌంట్ కు మారిపోయిన తర్వాత ఇందులో మినిమం బాలన్స్ లేకపోతే చార్జీలను వేస్తారు. ఇలాంటి అకౌంట్లో కార్పోరేటివి అయితే అందులో కచ్చితంగా మినిమం బాలన్స్ రూ. 10,000 ఉండాలి. ఈ మొత్తం లేకపోతె ప్రతినెలా చార్జీలు విధిస్తారు. ఒకవేళ ఇలాంటి అకౌంట్లపై చెట్టుకు లేదా ఏటీఎం కార్డు ఉంటే వాటి చార్జీలు కూడా పడతాయి.
అయితే ఇలాంటి చార్జీల నుంచి తప్పించుకోవాలంటే ఉద్యోగులు కంపెనీ లేదా సంస్థ మారినప్పుడు పాత బ్యాంక్ అకౌంట్ ను డీయాక్టివేటివ్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వీటి చార్జీలు చెల్లించకపోతే ఈ ప్రభావం సిబిల్ స్కోర్ పై కూడా ప్రభావం పడుతుంది. బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన చార్జీలను చెల్లించకపోతే సిబిల్ స్కోర్ తగ్గి భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలుగుతుంది. అందువల్ల ఎక్కువ అకౌంట్లను కలిగి ఉన్నవారు అవసరం లేని వాటిని వెంటనే క్లోజ్ చేసుకోవడం మంచిది. ప్రధానంగా నగదు వ్యవహారాలు జరిపే అకౌంట్లు మాత్రమే కొనసాగించడం వల్ల సిబిల్ స్కోర్ చక్కగా ఉంటుంది.