నిన్న తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేయగా నేడు ఏపీ విద్యాశాఖ పదో తరగతి పరీక్షలకు సంబంధించి ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం మార్చి నెల మూడో వారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యేవి. అయితే కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది రెండున్నర నెలలు ఆలస్యంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Also Read: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. నిరుద్యోగ భృతి ఎంతంటే..?
ఏపీ విద్యాశాఖ ప్రాథమిక నిర్ణయం ప్రకారం జూన్ నెల 7వ తేదీన పరీక్షలు ప్రారంభమై 14వ తేదీ వరకు జరగనున్నాయని తెలుస్తోంది. ఈ విధంగా షెడ్యూల్ ను రూపొందించనున్నారని తెలుస్తోంది. ఉదయం 9.35 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయని తెలుస్తోంది. ప్రాథమికంగా ఈ మేరకు షెడ్యూల్ గురించి విద్యాశాఖ నిర్ణయం తీసుకోగా తుది షెడ్యూల్ లో మార్పులు ఉండే అవకాశం ఉంది.
Also Read: పదో తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పిన విద్యాశాఖ..?
కరోనా విజృంభణ వల్ల ఈ సంవత్సరం 11 పేపర్లను విద్యాశాఖ ఏడు పేపర్లకు పరిమితం చేసింది. సైన్స్ కు రెండు పేపర్లు ఉండగా మిగిలిన సబ్జెక్టులకు ఒక పేపర్ ఉంటుంది. జూన్ 17వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ జరగనుండగా జులై 5వ తేదీన పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి. మే 31వ తేదీ వరకు పదో తరగతి విద్యార్థులకు క్లాసులు జరుగనున్నాయి.
మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు
పదో తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో 166 రోజుల పాటు క్లాసులు జరగనున్నాయని తెలుస్తోంది. మరోవైపు కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ఇంటర్ సిలబస్ లో 30 శాతం తగ్గనుందని రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది.