‘ఆచార్య’ టీజర్ టాక్: అన్యాయాలపై మెగా పౌరుషం

 మెగాస్టార్ అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. చిరంజీవి హీరోగా దిగ్గజ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. అందరూ ఊహించినట్టే టీజర్ వాయిస్ ఓవర్ ను రాంచరణ్ ఇచ్చారు. ఒక దేవాలయం.. ఆ దేవాలయంపై ఆధారపడి అందరికోసం జీవించే జనాలను కబళించే వారిపై పోరాడే ఒక ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ కనిపించనున్నారు. ‘ఆచార్య’ కథ రాష్ట్రంలోని దేవాలయాలు.. అనేక […]

Written By: NARESH, Updated On : January 29, 2021 5:53 pm
Follow us on

మెగాస్టార్ అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. చిరంజీవి హీరోగా దిగ్గజ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. అందరూ ఊహించినట్టే టీజర్ వాయిస్ ఓవర్ ను రాంచరణ్ ఇచ్చారు.

ఒక దేవాలయం.. ఆ దేవాలయంపై ఆధారపడి అందరికోసం జీవించే జనాలను కబళించే వారిపై పోరాడే ఒక ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ కనిపించనున్నారు. ‘ఆచార్య’ కథ రాష్ట్రంలోని దేవాలయాలు.. అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన కథ. ముఖ్యంగా అన్యాయాలను అక్రమాలను అరికట్టే శక్తిగా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడని టీజర్ చూస్తే తెలుస్తోంది. దేవాలయాల పేరుతో జరుగుతున్న అవకతవకల పై ఈ సినిమా కథ ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో చిరంజీవి సన్నగా.. నాజుగ్గా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడని టీజర్ చూస్తే తెలుస్తోంది. మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఈ చిత్రం ట్రైలర్ ఉంది.

‘ప్రజల కోసం జీవించే వారు దైవంతో సమానం.. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే.. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు’ అంటూ చిరంజీవి ఎంట్రీని ఓ రేంజ్ లో రాంచరణ్ వాయిస్ ఓవర్ తో కొరటాల చూపించారు. ‘ఆచార్య’ అని తనను ఎందుకు అంటారో కూడా చిరంజీవి సింపుల్ డైలాగులతో చెప్పిన తీరు బాగుంది.

ఇక ఈ సినిమాలో ఫైట్స్ ఆకట్టుకున్నాయి. చిరంజీవిని కొరటాల ఓ రేంజ్ లో చూపించారు. గూస్ బాంబ్స్ వచ్చేలా ఈ ట్రైలర్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి.

ఇక రామ్ చరణ్ ఈ సినిమాలో మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడట. అలాగే ఈ చిత్రంలో రెజీనా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం.. బ్యాక్ గ్రౌండ్ స్కోరు అదిరిపోయింది.

*టీజర్ ను కింద చూడొచ్చు.