https://oktelugu.com/

విజయ్ దేవరకొండతో నా మొదటి సినిమా అలా మిస్ అయింది

డియర్ కామ్రేడ్ లో విజయ్ దేవరకొండ పక్కన హీరోయిన్ పాత్రని మొదట నన్నే అడిగారంటూ జ్ఞానేశ్వరి కండ్రేగుల షాకింగ్ న్యూస్ బయట పెట్టింది. బుల్లితెర మీద ఎన్నో వివాదాలకు దారితీసిన ప్రదీప్ మాచిరాజు ‘పెళ్లిచూపులు’ ప్రోగ్రాం ద్వారా ఫేమస్ అయిన జ్ఞానేశ్వరి కండ్రేగుల ప్రస్తుతం శైలేష్ సన్ని హీరోగా అశోక్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న క్రౌడ్ ఫండెడ్ చిత్రం ‘మిస్టర్ & మిస్’ లో లీడ్ రోల్ చేస్తుంది. డేటింగ్, వీడియో చాటింగ్‌లతో పక్కదారి పడుతున్న యువతను […]

Written By:
  • admin
  • , Updated On : January 29, 2021 / 05:35 PM IST
    Follow us on


    డియర్ కామ్రేడ్ లో విజయ్ దేవరకొండ పక్కన హీరోయిన్ పాత్రని మొదట నన్నే అడిగారంటూ జ్ఞానేశ్వరి కండ్రేగుల షాకింగ్ న్యూస్ బయట పెట్టింది. బుల్లితెర మీద ఎన్నో వివాదాలకు దారితీసిన ప్రదీప్ మాచిరాజు ‘పెళ్లిచూపులు’ ప్రోగ్రాం ద్వారా ఫేమస్ అయిన జ్ఞానేశ్వరి కండ్రేగుల ప్రస్తుతం శైలేష్ సన్ని హీరోగా అశోక్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న క్రౌడ్ ఫండెడ్ చిత్రం ‘మిస్టర్ & మిస్’ లో లీడ్ రోల్ చేస్తుంది. డేటింగ్, వీడియో చాటింగ్‌లతో పక్కదారి పడుతున్న యువతను మేలుకొలిపే విధంగా దర్శకుడు ఆసక్తికర కథనంతో ఈ మూవీని రూపొందిస్తున్నాడు.

    Also Read: రివ్యూ : ’30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’ – బోరింగ్ లవ్ డ్రామా !

    ఈ రోజు విడుదల సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో జ్ఞానేశ్వరి మాట్లాడుతూ… నేను వైజాగ్ అమ్మాయిని, మా ఫ్యామిలీ లో అందరూ స్టేట్ టాప్ ర్యాంకర్స్, నేను కూడా వారిలా ఐఐటి, ఎంబీఏ చదవాలనే డ్రీమ్ ఉండేది. అలానే ఫ్యాషన్స్, మోడలింగ్ మీద ఉన్న ఇష్టంతో ఎంబీఏ ప్రిపేర్ అవుతూ లాక్మే ఫ్యాషన్ వీక్, మ్యాక్స్ ఫెస్టివల్స్ లలో వాక్ చేశాను. సినిమా, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేని నేను “నా క్లోజ్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ మేరకు నో చెప్పలేక ‘తను’ అనే షార్ట్‌ ఫిలింలో నటించాను”.

    ఆ తర్వాత ‘తను’ షార్ట్ ఫిలింకు సుమారు 4 మిలియన్ వ్యూస్ రావడంతో మంచి గుర్తింపు వచ్చింది. అక్కడి నుండి నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. విజయ్ దేవరకొండ సినిమాలో మిమ్మల్ని హీరోయిన్ గా అనుకుంటున్నామని నా ఫేస్ బుక్ అకౌంట్ కి ఒక మెసేజ్ పంపారు. నమ్మకం కుదరక ఇదంతా ఫేక్ అనుకుని అని లైట్ తీసుకుని వదిలేసాను. కానీ అది రియల్ అని తెలుసుకుని వెంటనే నేను డైరెక్టర్ భరత్ కమ్మ గారికి కాల్ బ్యాక్ చేసి వారి ఆఫీసుకు వెళ్లి ఆడిషన్స్ లాగా యాక్టింగ్ డిస్కషన్స్ కూడా చేయడం జరిగింది.

    Also Read: ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ ప్రేయసిని చూపించిన రాజమౌళి

    డియర్ కామ్రేడ్ ప్రీ ప్రొడక్షన్ లేట్ అవుతున్న టైం లో అర్జున్ రెడ్డి విడుదలయి సెన్సషనల్ హిట్ అవటంతో కొత్త ఆర్టిస్టు లతో చేద్దామనుకున్న వారు కాస్త సీనియర్, ఫేమ్ ఉన్న యాక్టర్స్ ను తీసుకోవడం జరిగింది. మొదటిసారి నన్ను అడిగిన వెంటనే ఆలస్యం చేయకుండా ఉంటే నా మొదటి సినిమా ‘డియర్‌ కామ్రేడ్‌’ అయ్యుండేదని జరిగిన స్టోరీని చెప్పుకొచ్చారు. ‘మిస్టర్‌ అండ్‌ మిస్‌’ అందరికీ నచ్చే బ్యూటిఫుల్‌ కమర్షియల్ అంశాలతో ప్రేక్షకుల్ని అలరిస్తుందని ఆమె ఆశా భావం వ్యక్తం చేశారు. తెలుగులో, కన్నడతో పాటు ఓటీటీలో కూడా అవకాశాలు వచ్చాయని వాటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని ఆమె అన్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్