https://oktelugu.com/

గ్రామ, వార్డ్ సచివాలయ అభ్యర్థులకు అలర్ట్.. ఉద్యోగాలకు మార్గదర్శకాలివే..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి విద్యార్థులు, యువత విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ, వార్డ్ సచివాలయాలు మరియు గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలను కల్పించింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలను కల్పించి అరుదైన రికార్డును ప్రభుత్వం ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత జగన్ సర్కార్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ నిరుద్యోగులకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 31, 2020 / 05:58 PM IST
    Follow us on


    ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి విద్యార్థులు, యువత విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ, వార్డ్ సచివాలయాలు మరియు గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలను కల్పించింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలను కల్పించి అరుదైన రికార్డును ప్రభుత్వం ఖాతాలో వేసుకుంది.

    ఆ తరువాత జగన్ సర్కార్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ నిరుద్యోగులకు మేలు చేకూరేలా చేస్తోంది. కరోనా, లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఉన్నా జగన్ సర్కార్ సెప్టెంబర్ నెలలో 16,208 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కొన్ని రోజుల క్రితం గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. జగన్ సర్కార్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది.

    అధికారులు అభ్యర్థులు సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. రోస్టర్ విధానంలో ఉద్యోగాల భర్తీ జరగనుండగా ఎంపికైన విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈసారి కటాఫ్ మార్కులు ఉండవని మెరిట్ జాబితాను అనుసరించి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.

    ఎంపికైన అభ్యర్థులకు నవంబర్ 2వ తేదీ నుంచి 5వ తేదీలోపు కాల్ లెటర్స్ పంపుతారు. కాల్ లెటర్స్ అందుకున్న అభ్యర్థులు మొదట సంబంధిత వెబ్ సైట్ లో సర్టిఫికెట్లను అప్ లోడ్ చేయాలి. అటెస్ట్ చేసిన సర్టిఫికెట్లతో పాటు క్యాస్ట్ సర్టిఫికెట్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.