https://oktelugu.com/

తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు విద్యాశాఖ శుభవార్త.. ఆన్ లైన్ లో టెట్..?

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రయోజనం కల్పించే దిశగా విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ప్రతి సంవత్సరం పదో తరగతి విద్యార్థులకు 11 ప్రశ్నాపత్రాల ద్వారా పరీక్షలు జరిగేవి. ఈ సంవత్సరం మాత్రం విద్యాశాఖ ఆరు ప్రశ్నాపత్రాల ద్వారా పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. సబ్జెక్టుకు ఒక పేపర్ మాత్రమే ఉండేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. Also Read: ఇంటర్ పాసైన వాళ్లకు శుభవార్త.. ఆ ఉద్యోగాలకు గడువు పొడిగింపు..? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 18, 2020 / 10:42 AM IST
    Follow us on


    కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రయోజనం కల్పించే దిశగా విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ప్రతి సంవత్సరం పదో తరగతి విద్యార్థులకు 11 ప్రశ్నాపత్రాల ద్వారా పరీక్షలు జరిగేవి. ఈ సంవత్సరం మాత్రం విద్యాశాఖ ఆరు ప్రశ్నాపత్రాల ద్వారా పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. సబ్జెక్టుకు ఒక పేపర్ మాత్రమే ఉండేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది.

    Also Read: ఇంటర్ పాసైన వాళ్లకు శుభవార్త.. ఆ ఉద్యోగాలకు గడువు పొడిగింపు..?

    మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంతో ప్రత్యక్ష విద్యా బోధన గురించి చర్చలు జరుపుతున్నామని అన్నారు. గతంలో చలికాలంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రత్యక్ష విద్యా బోధన విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సంక్రాంతి పండుగ తర్వాత 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

    Also Read: ఎమ్మెస్సీ అభ్యర్థులకు బార్క్ శుభవార్త.. రూ.40,000 స్టైఫండ్ తో ఫెలోషిప్..?

    ఇంటర్ విద్యార్థులకు కూడా ప్రత్యక్ష విద్యా బోధన అప్పటినుంచే ప్రారంభమవుతుందని.. కింది తరగతుల విద్యార్థులకు దశల వారీగా తరగతులను ప్రారంభించాలని ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. త్వరలో వైస్ ఛాన్స్ లర్ ఖాళీల భర్తీని కూడా చేపట్టబోతున్నట్టు సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మరోవైపు తెలంగాణ సర్కార్ టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    టీచర్ల ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో విద్యాశాఖ త్వరలో టెట్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది ఆన్ లైన్ లో టెట్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.