Russia-China Presidents: ప్రపంచంపై దండయాత్ర చేస్తున్న ఇద్దరు కరుడుగట్టిన దేశాధినేతలు ఇప్పుడు మరణం అంచున ఉన్నారా? వారిద్దరూ మరణశయ్యపై పడుకోవడానికి రెడీ అయ్యారా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అనారోగ్యంపై తాజాగా వార్తలు రావడం.. ఇదే క్రమంలోనే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కు ఓ పెద్ద వ్యాధి కారణంగా బయటకు రాలేకపోవడం చూస్తే వీరిద్దరికి భవిష్యత్ లేదని అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది.
-పుతిన్ సీరియస్.?
ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగి ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నారని..ఆయన బ్లడ్ క్యాన్సర్ తో సీరియస్ గా ఉన్నాడని తాజాగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. పుతిన్ ఆరోగ్యంపై రష్యా దాస్తోందని.. అది నయమయ్యేదేనా? కాదా? అనేది కూడా తెలియదు అంటూ పేర్కొన్నారు. రష్యాకు చెందిన ఒక సంపన్న వ్యక్తి పుతిన్ సీరియస్ గా ఉన్నాడని తెలిపారు. కేన్సర్ చికిత్సలో భాగంగా ఆయన వెన్నుకు మేజర్ శస్త్రచికిత్స చేశారని తెలుపడంతో ఈ ఊహాగానాలకు తెరలేచింది.. ఉక్రెయిన్ యుద్ధానికి ముందే ఈ ఆపరేషన్ జరిగిందట.. అయినా ఇప్పటీకీ పుతిన్ కోలుకోవడం లేదని.. ఆయన బతకడం కష్టమేనని అంటున్నారు. పుతిన్ కు రహస్యంగా వైద్యం అందిస్తున్నట్టుగా సమాచారం. దీంతో పుతిన్ పరిస్థితి విషమంగానే ఉందన్నవార్తలు వస్తున్నాయి.
Also Read: Amit Shah- Bandi Sanjay: కాషాయానికి బండే విజయ సారథి.. సంజయ్‌పై అధిష్టానం ధీమా..
-చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు మెదడు సమస్య?
మూడేళ్ల కిందటే చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ అనారోగ్యానికి గురైనట్టు ప్రచారం జరిగింది. అయితే వీటిని చైనా ఎక్కడ ఖండించలేదు. అలాగని సమర్థించలేదు. ప్రస్తుతం జిన్ పింగ్ మెదడుకు సంబంధించిన వ్యాధికి ఆయన చైనా సంప్రదాయ చికిత్స తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది. 2019లోనే జిన్ పింగ్ కు ‘సెరిబ్రల్ అనూరిజం’ అనే మెదడుకు సంబంధించిన వ్యాధి సోకి ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైనదని వైద్య వర్గాలు వెల్లడించాయి. మెదడులోని ధమని అసాధారణంగా స్పందిస్తుందని.. రక్తనాళాల గోడల లోపలి పొర బలహీనపడి మెదడులో రక్తం గడ్డకట్టుకుపోతుందని చెబుతున్నారు. దీంతో మెదడులోని రక్తనాళాలు ఏ క్షణమైనా పగిలిపోయి రక్తస్రావం అవుతుంది. దీంతో సదురు వ్యక్తికి స్ట్రోక్ వచ్చి కోమాలోకి వెళ్లిపోవడం.. లేదా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది.
ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న రెండు పెద్ద దేశాల అధినేతలు ఇలా తీవ్ర అనారోగ్యంతో బాధపడడం చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధాన్ని కేవలం పుతిన్ మాత్రమే ముగించగలడు. ఇక భారత్ సహా సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలుదువ్వేలా చేసి.. జీరో కోవిడ్ ఆంక్షలు పెట్టి చైనా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చుతున్న జిన్ పింగ్ పై అక్కడి ప్రజల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ఇద్దరు మోనార్క్ ల వల్ల ప్రపంచం అశాంతిగా ఉంది. ప్రస్తుతం ఇద్దరూ సీరియస్ స్టేజ్ లో ఒకేసారి ఉండడం ఉత్కంఠ రేపుతోంది. మరి వీరి భవిష్యత్ పైనే ఆయా దేశాల నిర్ణయాలు ఆధారపడి ఉన్నాయి. ఏం జరుగుతుందన్నది కాలమే సమాధానం చెబుతుంది.
Also Read: YCP Group Clashes Lakkireddypalle: పోలీసుల ఎదుటే వైసీపీ నేతల బాహాబాహీ
Recommended Videos: