Chitra Warning To Singer Mano: తెలుగు బుల్లితెరపై పలు సంగీత షోలు ఇప్పటికే ఘనమైన నీరాజనాలు అందుకున్నాయి. సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ టీవీలకు అతుక్కునేలా చేయడంలో ఈ షోలు విజయవంతం అయ్యాయి. బుల్లితెర సంగీత ఇలవేల్పుగా ‘పాడుతా తీయగా’ కార్యక్రమం ఓ వెలుగు వెలిగింది. గత 26 సంవత్సరాలుగా ప్రత్యేక అనుబంధంతో పెనవేసుకుపోయింది. వేలాది మంది నూతన గాయనీ గాయకుల భవిష్యత్తుకు పునాదులు వేసింది. అందుకే, ‘పాడుతా తీయగా’ ప్రేరణతో, ఈ స్వర యజ్ఞాన్ని పలు టీవీ ఛానల్స్ నిర్విఘ్నంగా కొనసాగించే ప్రయత్నం చేసున్నాయి. ఈ క్రమంలో మరో సంగీత సందడికి ముహూర్తం ఖరారు అయ్యింది. ‘స్టార్ మా’ లో ‘సూపర్ సింగర్ జూనియర్’ పేరుతో బాలల సంగీత షో రాబోతుంది.

Also Read: Illegal Affairs: ఏపీలో ఒక పురుషుడికి నాలుగు ఎఫైర్లు.. తెలంగాణలో ఎంతంటే?
సుధీర్, అనసూయ యాంకర్స్ గా చేస్తున్న ఈ షోను, ఈ నెల 22న గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. 14 మంది సూపర్ టాలెంటెడ్ కిడ్స్ ఈ షోలో పోటీ పడబోతున్నారు. రేపటి సంగీత సామ్రాజ్యాన్ని ఏలే తారలు అంటూ వచ్చిన ఈ షో ప్రోమో.. ప్రస్తుతం విపరీతంగా ఆకట్టుకుంటుంది. చిన్నారుల పరిచయంతో పాటు, జడ్జ్ ల ఎంట్రీలు కూడా ఈ ప్రోమోలో మెయిన్ హైలైట్ నిలిచాయి. ఈ షోకి జడ్జిలుగా సింగర్ మనో, చిత్ర, హేమచంద్ర, రణీనా రెడ్డి వ్యవహరిస్తున్నారు.

జడ్జ్ లంతా స్టేజ్ పైకి గ్రాండ్ విజువల్స్ తో రావడం చాలా బాగుంది. ఐతే, ‘ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు..’ అని బాలకృష్ణ డైలాగును చిత్ర గారు చెప్పిన విధానం ప్రోమోకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే, ఆమె డైలాగ్ కి మనో ఇచ్చిన ఫన్నీ రియాక్షన్ కూడా సరదాగా అనిపించింది. ఇక పిల్లలు స్టేజ్ పైకి వస్తూనే.. సుధీర్, అనసూయల పైనే పంచ్ లు వేశారు. ‘పాల కూర పప్పు మా సుధీర్ అన్న నిప్పు’ అంటూ సుధీర్ కే షాక్ ఇచ్చాడు ఓ చిచ్చర పిడుగు. పిల్లల పంచ్ లకు సుధీర్ బిక్కమొహం పెడుతూ ‘వీళ్ళను హ్యాండిల్ చేయడం కష్టమే’ అంటూ పేరెంట్స్ వైపు చూసి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ నవ్వులు పూయించింది. మొత్తమ్మీద ఈ షోతో సంగీత ప్రేమికులకు మరో మ్యూజిక్ ట్రీట్ గ్యారంటీలా అనిపిస్తోంది.
Also Read: Bigg Boss Telugu OTT- Nataraj Master: బిందు తో పెట్టుకుంటే ఇంతే… బూతుల మాస్టర్ ఎలిమినేట్!
Recommended Videos:



[…] Also Read: Chitra Warning To Singer Mano: సింగర్ మనోకి చిత్రాగారు వ… […]