Valentine’s Day Special : ప్రేమికుల పీచేముడ్.. లవర్స్ డే షాపింగ్ పై ఈ కామర్స్ దెబ్బ.. వాళ్లు విలవిల 

Valentine’s Day Special :  ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 14 రాగానే ప్రేమికుల్లో ఎదో తెలియని ఉత్సాహం.. కొందరు తమ ప్రేమను తెలియజేయడానికి ఈ రోజును వాడుకుంటే.. మరికొందరు ఇప్పటికే ప్రేమిస్తున్న వారికి విభిన్న రీతిలో విషేష్ చెప్పాలనుకుంటారు. ఈ క్రమంలో తమ ప్రియమైన వారికి మంచి బహుమతి ఇవ్వాలనుకుంటారు. అయితే ఎక్కువ మంది అప్పటి వరకు ఒక అమ్మాయి అబ్బాయిని గానీ.. లేదా ఒక అబ్బాయి అమ్మాయిని గానీ ఇష్టపడి ఉంటే ప్రేమికుల  రోజు సందర్భంగా తమ […]

Written By: NARESH, Updated On : February 15, 2022 11:33 am
Follow us on

Valentine’s Day Special :  ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 14 రాగానే ప్రేమికుల్లో ఎదో తెలియని ఉత్సాహం.. కొందరు తమ ప్రేమను తెలియజేయడానికి ఈ రోజును వాడుకుంటే.. మరికొందరు ఇప్పటికే ప్రేమిస్తున్న వారికి విభిన్న రీతిలో విషేష్ చెప్పాలనుకుంటారు. ఈ క్రమంలో తమ ప్రియమైన వారికి మంచి బహుమతి ఇవ్వాలనుకుంటారు. అయితే ఎక్కువ మంది అప్పటి వరకు ఒక అమ్మాయి అబ్బాయిని గానీ.. లేదా ఒక అబ్బాయి అమ్మాయిని గానీ ఇష్టపడి ఉంటే ప్రేమికుల  రోజు సందర్భంగా తమ మనసులోని మాటను బయట పెట్టాలని అనుకుంటున్నారు. అయితే ప్రేమికుల రోజు కేవలం లవర్స్ కు మాత్రమే కాకుండా కొందరు వ్యాపారులు పంట కూడా పండేది. కానీ కరోనా కారణంగా ఇప్పుడు ఈ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడింది.

ఒక వ్యక్తి తనకు నచ్చిన వారికి తన ప్రేమను తెలియజేయడానికి ముఖ్యంగా రోజ్ ప్లవర్ ను ఉపయోగిస్తారు. దీంతో వాలంటైన్స్ రోజున ఈ ప్లవర్ ఇవ్వాలన్న సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. దీంతో లవర్స్ డే రోజున అత్యధికంగా గులాబీ పూలు అమ్ముడుపోతాయి. ఢిల్లీలోని ఓ వ్యాపార వేత్త తెలిపిన ప్రకారం 2017లో పూల వ్యాపారం ప్రారంభించాడు. మొదటి మూడేళ్లు వ్యాపారం బాగా సాగింది. ముఖ్యంగా వాలంటైన్స్ డే రోజులు ఎక్కువగా అమ్మకాలు జరిగేవి. కానీ202లో కరోనా ఎంట్రీ కారణంగా పూల వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడింది. ఒకప్పటిలా ఇప్పుడు ప్రేమికుల రోజును రోజా పూలు ఇచ్చిపుచ్చుకోవడానికి ఎవరూ ఇష్టపడడం లేదు.. అని సదరు వ్యాపార వేత్త తెలిపాడు.

ఇక వాలంటైన్స్ డే రోజున కేవలం పూలు మాత్రమే కాకుండా తమ ప్రియమైన వారికి మంచి బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేయాలనుకుంటారు. ఇందులో భాగంగా రకరకాల గిఫ్ట్ ల కోసం షాపింగ్ చేస్తారు. దీంతో బహుమతులు అమ్మే దుకాణాల్లో కూడా వాలంటైన్స్ డే రోజు సందడి కనిపించేది. అయితే వీటిపై కూడా కరోనా ప్రభావం పడిందనే చెప్పవచ్చు. అయితే కరోనాతో పాటు బహుమతులు ఇవ్వడంలో కాస్త వెనుకడుగు వేయడంతో ఈ షాపులపై ఎఫెక్ట్ పడింది. బహుమతుల షాపులే కాకుండా కేకులు, ఇతర స్వీట్ షాపుల్లోనూ ఈరోజు సందడి ఉండేది. కానీ కరోనా ఈ వ్యాపారాలపై ప్రభావం చూపింది.

వాలంటైన్స్ డే రోజు పలు వ్యాపారాలు తగ్గడానికి ఈ కామర్స్ విధానం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఎందుకంటే చాలా మంది ప్రేమికులకు తమ ప్రియమైన వారిని సర్ ప్రైజ్ చేయడానికి ఎక్కువగా ఆన్ లైన్ షాపింగ్ ను ఆశ్రయిస్తున్నారు. డిఫరెంట్ గిఫ్ట్ లతో పాటు సుదూర ప్రాంతాల్లో ఉన్న తామ ప్రేయసి, ప్రియుడికి గిఫ్ట్ అందించడానికి ఈరోజు కుదరకపోవడంతో ఈకామర్స్ ను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆఫ్ లైన్ షాపింగ్ అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. భారతీయ ఈ కామర్స్ 2025 నాటికి 111.40 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. 202లో ఈ మొత్తం 46.2 బిలియన్ డాలర్లు గా ఉంది. అదే 2030 నాటికి 350 బిలియన్ డాలర్లకు పెరిగిపోతుందని అంచనా వేస్తున్నారు.

2021లో కొవిడ్ ఎఫెక్ట్ ఉన్నప్పటిక ఈ కామర్స్ ప్రభావమే ఆఫ్ లైన్ షాపింగ్ పై తీవ్ర ప్రభావం చూపిందని వ్యాపార నిపుణులు పేర్కొంటున్నారు. 2021లో 56.6 బిలియన్ డార్ల అమ్కాలతో భారతదేశ ఈ కామర్స్ 5 శాతం పెరిగింది. స్మార్ట్ ఫోన్ వ్యాప్తి, 4 జీ నెట్ వర్క్ లు పెరిగిన వినియోగదారులతో భారతదేశ ఈ కామర్స్ 2026 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చనని అంచనా వేస్తున్నారు.