Hero Raja: సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడమంటే మాటలు కాదు. కానీ కొందరు ఏదో రకంగా సినిమాల్లో నటించడానికి ట్రై చేస్తారు. కానీ జీవితాంతం సినిమాల్లో నటించాలనుకోవడం అందరికీ సాధ్యం కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వారు కొందరైతే.. మధ్యలో వచ్చి మధ్యలోనే మానేసిన ఎంతో మంది నటులు ఉన్నారు. వీరిలో రాజా ఒకరు. మొదట్లో సైడ్ క్యారెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన రాజా ‘ఆనంద్’ సినిమాతో మెయిన్ హీరోగా మారాడు. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటించాడు. నటించడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. చివరికి సినీ ఫీల్డుపైనే విరక్తి పుట్టిందట. అందుకే దైవత్వం వైపు వెళ్లాడు. ఇంతకీ రాజా ఇప్పడు ఏం చేస్తున్నాడంటే?
రాజా నటించిన ప్రతీ సినిమాలో చిరునవ్వుతో కనిపించారు. కానీ ఆయన పర్సనల్ లైఫ్ విషాదంగానే మారింది. విశాఖపట్నంలో జన్మించిన రాజా తల్లి క్రిస్టియన్, తండ్రి హిందూ మతానికి చెందిన వారు. ఇంకేముంది ఇరువురు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో వీరు సెపరేట్ లైఫ్ ను స్ట్రాట్ చేశారు. కానీ రాజాకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. దీంతో తీరిన శోకంలో మునిగిపోయింది కుటుంబం. అయితే వ్యాపార రీత్యా రాజా నాన్న అమెరికాకు వెళ్లారు. తిరిగి వచ్చిన కొన్ని రోజులకే గుండెపోటుతో మరణించారు. దీంతో రాజా, అతని అక్క ఇద్దరు బాగా డిప్రెషన్లకి వెళ్లారు. ఈ సమయంలో రాజా వయసు అప్పటికీ 14 ఏళ్లు. దీంతో ఆయనా పార్ట్ టైం జాబ్ చేస్తూ అక్కతో కలిసి జీవించేవాడు. అయితే చదువు పూర్తయిన తరువాత ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం రావడంతో వారి కష్టాలు దాదాపుగా తీరిపోయాయి.
ఈ సమయంలో రాజాకు నటుడు కావాలనే కోరిక ఉండేది. దీంతో తాను చేస్తున్న ఉద్యోగం మానేసి అమెరికా వెళ్లి శిక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తరువాత ఇండియాకు వచ్చి అవకాశాల కోసం వెతగ్గా ప్రముఖ నిర్మాత డి.రామానాయుడి కంట్లో పడ్డాడు. దీంతో ‘ఓ చిన్నదాన’అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా సక్సెస్ కావడంతో రాజాకు మంచిరోజుల వచ్చాయి. ఆ తరువాత శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ‘ఆనంద్’ బ్లాక్ బస్టర్ కావడంతో పాటు రాజా లైఫ్ కూడా టర్న్ అయింది.
ఇలా ఆయన నటించిన సినిమాలు కొన్ని సక్సెస్ అయ్యాయి. వాటిలో విజయం, తదితర సినిమాలు ఉన్నాయి. కొన్ని రోజుల తరువాత రాజాకు అవకాశాలు తగ్గడంతో సైడ్ పాత్రల్లో నటించడానికి సిద్ధమయ్యారు. అలా ‘ఆనలుగురు’లో రాజేంద్రప్రసాద్ కొడుకుగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పవన్, మహేష్ బాబుతో నటించాలన్న కోరిక ఉండేది. ఆ ముచ్చటా తీర్చుకున్నాడు. పవన్ తో బంగారం, మహేష్ తో అర్జున్ సినిమాలో నటించాడు. ఈ సినిమాలు ఆశించిన విజయం సాధించకపోయినా రాజా కోరిక మాత్రం తీరింది.
అయితే ఇక రాను రాను ఇండస్ట్రీలో పోటీ కారణంగా రాజాకు అవకాశాలు మరింత దూరమయ్యాయి. దీంతో ఆయనకు సినిమా మీద విరక్తి పుట్టింది. సినిమాలతో లైఫ్ ఉండదని అర్థమైంది. దీంతో దైవత్వం వైపు వెల్లారు. తన తల్లి క్రిస్టియన్ కావడంతో ఆయన క్రిస్టియానిటీ గురించి చెప్పే వక్తగా మారిపోయాడు. సినిమాల్లో హీరోగా కనిపించిన రాజా ఇలా మారడానికి కారణమేంటి? అన్న విషయాన్ని మాత్రం ఆయన బయటపెట్టలేదు. ఏదీ ఏమైనా మనం అనుకున్నవన్నీ జరిగితే జీవితంలో ట్విస్టేముంటుంది? అని కొందరు చర్చించుకుంటున్నారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Cute hero raja why has he changed like this
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com