Digital Kidnapping: డిజిటల్ కిడ్నాపింగ్ అంటే ఏంటి ? ఇప్పటి వరకు ఇలా ఎక్కడ చేశారు? ఈ కిడ్నాప్ ఎలా చేస్తారు?

డిజిటల్ కిడ్నాప్ నే వర్చువల్ కిడ్నాప్, సైబర్ కిడ్నాప్ అని కూడా ఉంటారు. ఈ కిడ్నాప్ ను అమెరికాలో చేశారని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) తెలిపింది. అమెరికాలో నివాసం ఉంటున్న చైనాకు చెందిన కై జుయాంగ్ అనే విద్యార్థిని కొందరు కిడ్నాప్ చేసినట్లు తమకు ఫోన్ కాల్స్ వచ్చాయని ఆ విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

Written By: Chai Muchhata, Updated On : July 26, 2024 10:40 am

Digital Kidnapping

Follow us on

Digital Kidnapping: ఈ భూమ్మీద మనుషులు మనస్తత్వాలు ఎన్నో రకాలు ఉంటాయి. కానీ డబ్బు సంపాదన విషయంలో మాత్రం రెండు రకాలుగా ఉంటారు. ఒకరు కష్టపడి డబ్బు సంపాదించడం.. మరొకరు డబ్బున్న వారి నుంచి దోచుకోవడం.. ప్రస్తుత కాలంలో కష్టపడి డబ్బు సంపాదించే వారి సంఖ్య తక్కువవుతోంది. టెక్నాలజీ వచ్చిన తరువాత కొన్ని పనులు ఈజీగా మారిపోయాయి. దీంతో చాలా మంది ఆన్ లైన్ లోనే నగదు ట్రాన్జాక్షన్ ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఆన్ లైన్ లో డబ్బు పంపించే వారికి ఫోన్ కాల్ చేసి వారి డీటేయిల్స్ తెలుసుకొని సులభంగా నగదును తస్కరిస్తున్నారు. డబ్బు అపహరణ విషయంలో ఎన్నో సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడానికి సాంకేతికం కూడా అందుబాటులోకి వస్తోంది. కానీ కొందరు నేరగాళ్లు అప్డేట్ అవుతూ కొత్త రకం మోసాలు చేస్తూ డబ్బులు దోచుకుంటారు. ఈ తరుణంలో ‘డిజిటల్ కిడ్నాపింగ్’ పేరు బాగా వినిపిస్తోంది. డిజిటల్ కిడ్నాప్ గురించి మన దేశంలో ఇప్పుడిప్పుడే వినిపిస్తోంది. కానీ అమెరికా, చైనా లాంటి దేశాల్లో దశాబ్దాలుగా జరుగుతోంది. డిజిటల్ కిడ్నాప్ ద్వారా కోట్ల రూపాయలు డబ్బులు దోచుకున్నారు. కొందరిని అరెస్టు చేశారు. సాధారణంగా మనుషులను కిడ్నాప్ చేయడం అంటే ఒక వ్యక్తిని ఎత్తుకెళ్లి రహస్య ప్రదేశంలో ఉంచి వారి బంధువులకు ఫోన్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. మరి డిజిటల్ కిడ్నాప్ అంటే ఏంటి? దీనిని ఎలా చేస్తారు?

డిజిటల్ కిడ్నాప్ నే వర్చువల్ కిడ్నాప్, సైబర్ కిడ్నాప్ అని కూడా ఉంటారు. ఈ కిడ్నాప్ ను అమెరికాలో చేశారని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) తెలిపింది. అమెరికాలో నివాసం ఉంటున్న చైనాకు చెందిన కై జుయాంగ్ అనే విద్యార్థిని కొందరు కిడ్నాప్ చేసినట్లు తమకు ఫోన్ కాల్స్ వచ్చాయని ఆ విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. కానీ ఆ విద్యార్థి సురక్షితంగానే ఉన్నాడు. కానీ అప్పటికే విద్యార్థి తల్లిదండ్రులు తమ బాబు అపహరణకు గురయ్యాడని, డబ్బులు చెల్లించకపోతే తమ బాబుకు ప్రమాదం ఉంటుందని భావించి పెద్ద మొత్తంలో నేరగాళ్లకు డబ్బులు చెల్లించారు. ఈ విషయాన్ని ఆ తరువాత పోలీసులకు తెలిపారు. ఈ వ్యవహారంలో తల్లిదండ్రులు 80 వేల అమెరికన్ డాలర్లు చెల్లించినట్లు అమెరికా పోలీసులు తెలిపారు.

డిజిటల్ కిడ్నాప్ నుంచి రెండు దశాబ్దాలుగా అమెరికా, చైనాలో వినిపిస్తోంది. సాధారణ కిడ్నాప్ విషయంలో మనుషులను తీసుకెళ్లి రహస్య ప్రదేశంలో బంధీస్తారు. కానీ డిజిటల్ కిడ్నాప్ లో మనుషులను ఎటూ తీసుకెళ్లరు. కానీ తమ బంధువులను కిడ్నాప్ చేసి ఉంచామని, వెంటనే డబ్బులు చెల్లించకపోతే ప్రమాదం తలపెడుతామని బెదిరిస్తారు. ఇదే సమయంలో పోలీసులకు కాల్ చేస్తే వెంటనే ప్రాణం తీయడానికి కూడా వెనుకాడమని చెబుతారు. దీంతో కొందరు కుటుంబ సభ్యులు బెదిరిపోయి ఇతర మార్గాలను ఆలోచించకుండా వారు అడిగిన డబ్బు చెల్లిస్తారు. కానీ తమ బంధువుల గురించి ఆ తరువాత వాకబు చేయగా వారు ఎలాంటి కిడ్నాప్ నకు గురి కాలేదని తెలుసుకొని మోసపోయినట్లు గ్రహిస్తారు.

డిజిటల్ కిడ్నాప్ ఎక్కువగా అమెరికా, చెనాలోనే ఉండడానికి ఇక్కడును మనుషుల వద్ద ధనం అధికంగా ఉండడమే. ఈ రకమైన కిడ్నాప్ నకు పాల్పడేవాళ్లు డబ్బున్న వాళ్లను లక్ష్యంగా చేసుకుంటారు. ఈ రకమైన మనుషుల్లో బంధాల కోసం ఎంతకైనా ఖర్చుపెట్టడానికి వెనుకాడరు. ముఖ్యంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని వారిని బెదిరించి డబ్బులు లాగేస్తారు. 2023 ఏడాదిలో షెఫీల్డ్ వెళ్లే విద్యార్థులను డిజిటల్ కిడ్నాప్ ను పాల్పడే వారి వలలో పడకుండా ఉండాలని సూచించింది.

2023లో ఆస్ట్రేలియాలో డిజిటల్ కిడ్నాప్ లు లు పెరుగుతున్నాయని హెచ్చరించింది. ఈ మోసాలు ఎక్కువగా చైనా నుంచే జరుగుతున్నట్లు ఆస్ట్రేలియలోని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. చైనా నుంచి వీరు అధికారులమని చెప్పి బెదిరిస్తారని, ఇలాంటి కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు.