https://oktelugu.com/

Naga Panchami : నాగ పంచమి ఎప్పుడో తెలుసా? 9, 10 తేదీల్లో కాలసర్ప దోష నివారణ పూజలకు ముహూర్తం.. పండితులు ఏమంటున్నారంటే?

నాగపంచమి వేడుకలకు అంతా సిద్ధమైంది. ఆలయాల్లో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈసారి నాగ పంచమి ఏ రోజు వస్తున్నది.. అసలు కాలసర్ప దోష పూజలు ఎప్పుడు చేసుకోవాలి అనే దానిపై భిన్నాబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీని గురించి పండితులు ఏమంటున్నారో ఓకే తెలుగు వ్యూవర్స్ కోసం..

Written By:
  • NARESH
  • , Updated On : August 8, 2024 / 02:24 PM IST
    Follow us on

    Naga Panchami : ఈ ఏడాది క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే ఆగస్టు 9వ తేదీ శుక్రవారం నాగపంచమి జరుపుకునేందుకు ప్రజలు సిద్ధం అవుతున్నారు. హిందూ సంప్రదాయంలో నాగ పంచమి పండుగకు అత్యంత ప్రాధాన్యం ఉంది. పరమ శివుడి ఆభరణమైన నాగ రాజును వేడుకోవడంలో భాగంగా సమస్త నాగజాతికి ఆ రోజున పూజలు చేస్తారు. నాగపంచమి ఏర్పాటుపై పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి. మహా విష్ణువు నాగదేవుడికి ఇచ్చిన వరం మేరకు ఈ పూజలు జరుగుతాయని చెబుతుంటారు. నాగదేవుడి పుట్టిన రోజైన శ్రావణ శుద్ధ పంచమి రోజున మనుషులంతా పూజలు చేస్తారని చెబుతుంటారు. శ్రావణ మాసంలో వచ్చే శుక్ర పంచమి రోజున నాగ పంచమి వేడుకలను నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఏడాది ఆగస్టు 9న శుక్రవారం నాగపంచమి వచ్చింది. అయితే శుక్ల పక్షంలో శుద్ధ పంచమి తిథి శుక్రవారం అర్ధరాత్రి 12.36 గంటలకు మొదలై, మరునాడు ఆగస్టు 10 శనివారం మధ్యాహ్నం 3.14 గంటలకు ముగుస్తుంది. దీంతో ఏ రోజు పండుగ జరుపుకోవాలనే అంశంపై చాలా అనుమానాలు ఉన్నాయి. అయితే ఎక్కువ శాతం మంది నాగపంచమిని శుక్రవారమే జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 9న నాగపంచమి ఉదయం 5.47 గంటల నుంచి 8.27 గంటల వరకు పూజలు నిర్వహించుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ రోజు నాగదేవతలకు పుట్టల వద్ద పాలు పోస్తారు. ప్రత్యేక వంటకాలు చేస్తారు. కొంత మంది ఉపవాసం ఉంటారు.

    నాగ పంచమి ఇలా జరుపుకోవాలి
    సూర్యోదయానికి ముందే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పూజా మందిరంలో ఎర్రటి వస్త్రం పరిచి దానిపై నాగదేవత ఫొటోను ఉంచి కుంకుమ, పసుపు కలిపిన అక్షింతలు తయారు చేసుకోవాలి. అనంతరం పూలు వేయాలి. దీపారాధాన, పాలాభిషేకం చేయాలి. నాగదేవతకు పాలు, పంచదారను నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం నాగదేవత కథ చదువుతారు. నాగదేవత ను పూజిస్తే కోరికలన్నీ నెరవేరుతాయి. సర్పదోష నివారణ కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.

    ఇక రాహుకేతువల నుంచి విముక్తి పొందేందుకు కూడా కాల సర్పదోష పూజలు చేస్తారు. ఇక నాగ పంచమి రోజున భూమిని తవ్వడం లాంటి పనులు చేయరు. నాగ పంచమి రోజున సాయంకాలం పాముల పేర్లు పలకకూడదని కొందరు పండితులు చెబుతుంటారు. 12 రకాల నాగులకు ఈ రోజున పూజలు చేస్తుంటారు. ఈ పర్వదినాన పాముల పుట్టల వద్ద పాలుపోసి భక్తులు తమ కోరికలను మొక్కుకుంటారు. తమను, తమ కుటుంబాలను కాపాడాలని పూజిస్తారు.

    ఇలా మొక్కులు చెల్లిస్తే నాగదేవుల ఆశీస్సులు తమతో పాటు తమ కుటుంబసభ్యులపై ఉంటాయని భావిస్తారు. ఇక ఈ రోజు పుట్టల వంటివి తవ్వితే కీడు వస్తుందని భావిస్తుంటారు. ఇక ఈ ఏడాది ఆగస్టు 9న అర్ధరాత్రి 12.36 గంటలకు మొదలై, మరునాడు ఆగస్టు 10 శనివారం మధ్యాహ్నం 3.14 గంటలకు ఈ తిథి ముగుస్తుంది. దీంతో పూజలకు ఇప్పటికే ప్రజలంతా సిద్ధమవుతున్నారు. మార్కెట్లలో పూజా సామగ్రి కొనుగోలు చేస్తున్నారు. పుట్టల వద్ద పూజల ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాల్లో ప్రత్యేకంగా పుట్టల వద్ద మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చి పూజలు చేయనున్నారు.