Hyderabad: పట్టణాలు, నగరాల్లో ట్రాఫిక్ విపరీతంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో రోడ్డు దాటడమే కష్టంగా మారుతంది. సాయంత్రం వేళల్లో అయితే నడవడమే ఇబ్బందిగా ఉంటుంది. ఇక హైదరాబాద్ సిటీలో సాయంత్రం కార్యాలయం నుంచి, స్కూల్ నుంచి ఇంటికి చేరడానికి.. పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఎంత ట్రాఫిక్ ఉన్నా కొందరు వాహనాలను జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. మరికొందరు మాత్రం స్పీడ్ డ్రైవ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తారు. ఈ క్రమంలో స్పీడ్ గా వెళ్తున్న కొందరిని మెల్లిగా వెళ్లాలని సూచిస్తుంటారు. కొందరు ఆ సూచనలను పాటిస్తారు. మరికొందరు పట్టించుకోరు. కానీ ఈ బైకర్ మాత్రం ఏకంగా చంపేశాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు స్టోరీ ఏంటంటే?
హైదరాబాద్ లోని అల్వాల్ ప్రాంతం తీవ్ర రద్దీగా ఉంటుంది. నిత్యం ప్రయాణికుల రాకపోకలు సాగిస్తుంటారు. సాయంత్రం సమయంలో అయితే మరీ దారుణ పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో వృద్ధులు అయితే బయటకు రారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏదో అవసరాల కోసం రోడ్డుపైకి వచ్చాడు. ఆ తరువాత రోడ్డు దాడేందుకు రోడ్డు పక్కన కూర్చున్నాడు. ఆ తరువాత ఎలాగోలా రోడ్డు దాటేందుకు ముందుకు కదిలాడు. అయితే ఇంతలో ఓ వ్యక్తి బైక్ పై దూసుకొచ్చాడు. దీంతో అతడిని స్లోగా వెళ్లాలని సూచించాడు.
అయితే ఆ బైకర్ ముందుకు వెళ్లి బైక్ ను ఆపి తిరిగి వచ్చాడు. ఆ తరువాత వెంటనే ఆ వృద్ధుడిని తోసేశాడు. అతను కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆ తరువాత బైకర్ తిరిగి వెళ్లాడు. అక్కడున్న కొంత మంది వృద్ధుడిని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. దీంతో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోపై చాలా మంది రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు జాగ్రత్తలు చెప్పినందుకే చంపేస్తారా? అని అంటున్నారు. మరి కొందరు స్పీడ్ గా బైక్ నడిపే వారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. అయితే అనవసరంగా వృద్ధుడి ప్రాణాలు పోయాయంటూ కొందరు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హైదరబాద్ లో ట్రాఫిక్ నిత్యం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో బైక్ ను స్లోగా నడపడం వల్ల అందరికీ మంచిది. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇక హైదరాబాద్ లో వర్షం పడినప్పడు ట్రాఫిక్ మరీ దారుణంగా ఉంటుంది. ఒక్కోసారి గంటల కొద్దీ రోడ్డుపై నిల్చోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సమయంలో కొందరు రోడ్డు ను దాటే సమయంలో చూసుకొని వెళ్లాలని కోరుతున్నారు. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తూ సరైన మార్గంలో వెళ్లాలని పోలీసలు చెబుతున్నారు. లేకుంటే పాదాచారుల నష్టపోవాల్సి వస్తుందని తెలుపుతున్నారు.
A senior citizen died after being attacked by a motorbiker after he questioned overspeeding
The incident happened in Alwal, Hyderabad, an elderly man was crossing the road when a speeding motorbiker, travelling with his family brushed past the senior citizen, who reacted to the… pic.twitter.com/ID8DYwKc3d
— The Siasat Daily (@TheSiasatDaily) October 17, 2024