https://oktelugu.com/

WhatsApp: మీరు ఫుల్ గా చాట్ చేసే వాట్సప్ కు డబ్బులు ఎక్కడ నుంచి వస్తుంటాయి?

ప్రపంచవ్యాప్తంగా వివిధ డేటా సెంటర్‌లలో ఉన్న శక్తివంతమైన సర్వర్‌లను వాట్సాప్ ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే. మరి దీనికి ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. అయినా సరే మీరు కానీ మీతో చాట్ చేస్తున్న వారు గానీ దీన్ని ఉపయోగించుకోవడానికి ఎలాంటి డబ్బూ చెల్లించడం లేదు.

Written By: Swathi Chilukuri, Updated On : October 18, 2024 4:03 pm
Whatsup

Whatsup

Follow us on

WhatsApp: ప్రపంచవ్యాప్తంగా వివిధ డేటా సెంటర్‌లలో ఉన్న శక్తివంతమైన సర్వర్‌లను వాట్సాప్ ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే. మరి దీనికి ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. అయినా సరే మీరు కానీ మీతో చాట్ చేస్తున్న వారు గానీ దీన్ని ఉపయోగించుకోవడానికి ఎలాంటి డబ్బూ చెల్లించడం లేదు. ఈ ప్లాట్‌ఫారమ్‌ ను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కోట్ల మంది వినియోగించుకుంటున్నారు. మరి వాట్సాప్ దీనికయ్యే ఖర్చును ఎలా భరిస్తోంది అనే అనుమానం ఎప్పడైనా వచ్చిందా?

ఈ వాట్సాప్ వెనక ఒక భారీ పేరెంట్ కంపెనీ మెటా ఉందట. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు కూడా మెటా సంస్థవే అని సమాచారం. వ్యక్తిగత వాట్సాప్ అకౌంట్‌లు ఉచితం కానీ యూజర్లతో సంభాషించాలనుకునే కార్పొరేట్ కస్టమర్‌ల నుంచి డబ్బు వసూలు చేస్తుందట వాట్సప్. గత సంవత్సరం నుంచి అనేక సంస్థలు వాట్సాప్‌లో ఉచితంగా చానళ్లను ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. కాబట్టి వాటిని సబ్‌స్క్రైబ్ చేసుకునే వాళ్లందరికీ ఇప్పుడు మెసేజ్‌లు పంపుకునే అవకాశం ఉంది.

ఇప్పుడు కొన్ని సంస్థలకు యాప్ ద్వారా కస్టమర్‌లతో వ్యక్తిగత సంభాషణ, లావాదేవీలు చేయగలిగే యాక్సెస్ లభించింది. దీని కోసం అవి ప్రీమియం చెల్లిస్తున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే యూకేలో ఈ సర్వీస్ ప్రారంభ దశలోనే ఉంది. భారత్‌లో బెంగళూరులాంటి నగరాలలో మీరిప్పుడు వాట్సాప్‌తో బస్ టిక్కెట్‌ కొనే అవకాశం వచ్చింది. దీని ద్వారా మీ సీటును మీరు సులభంగా ఎంచుకోవచ్చు. వాట్సప్ కష్టం ఫలిస్తే ఒక వ్యాపారసంస్థ, కస్టమర్‌లు జరిపే చాట్ థ్రెడ్‌లోనే వాళ్ల పనులు జరిగిపోవాతాయి కావచ్చు.

టిక్కెట్‌ను బుక్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా రీఫండ్ పొందాలన్నా, పేమెంట్లు చేయాలన్నా చాట్ లోనే అవన్నీ అయిపోవాలి అని ప్లాన్ చేస్తున్నారట. అయితే వీటి కోసం మాత్రం కొన్ని సంస్థలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే వ్యాపార సంస్థలు ఇప్పుడు డబ్బు చెల్లించి, ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లోని ఆన్‌లైన్ ప్రకటన నుంచి నేరుగా పర్సనల్ అకౌంట్‌కు కొత్త వాట్సాప్ చాట్‌ను ప్రారంభించే లింక్‌ను పొందే అవకాశం ఉంటుంది అంటున్నారు నిపుణులు. దీని ద్వారా వాట్సప్ కు కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది.

ఇతర మెసేజింగ్ యాప్‌లు వేర్వేరు మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతున్న విషయం తెలిసిందే. సిగ్నల సంస్థ మెసేజ్ సెక్యూరిటీ ప్రోటోకాల్‌లకు ప్రసిద్ధి చెందిన లాభాపేక్ష లేని సంస్థగా పేరు పొందింది ’. ఈ సంస్థ తాము ఎప్పుడూ ఇన్వెస్టర్ల నుంచి డబ్బు తీసుకోలేదట. కానీ దానికి బదులు, ఇది విరాళాలపై నడుస్తుందని సమాచారం.

“విరాళాలపై ఆధారపడుతూ, పూర్తిగా చిన్న దాతల సహకారం తీసుకోవడమే లక్ష్యం అని దాని ప్రెసిడెంట్ మెరెడిత్ విట్టేకర్ గత సంవత్సరం తన బ్లాగ్ పోస్ట్‌లో రాశారు. యువ గేమర్‌లు ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ డిస్కార్డ్‌లో ప్రీమియం మోడల్‌ ఉంటుంది. దీనిలో సైన్-అప్ చేయడం ఉచితమే. కానీ గేమ్‌లకు యాక్సెస్‌తో సహా అదనపు ఫీచర్‌లు పొందాలంటే డబ్బు చెల్లించాల్సిందే. కానీ వాట్సప్ మాత్రం కాస్త డిఫరెంట్ మోడ్ లో డబ్బు సంపాదిస్తుందన్నమాట.