https://oktelugu.com/

Bihar: పెళ్లికి ప్రియుడి నిరాకరణ.. ఆ మహిళా డాక్టర్ చేసిన పనికి అంతా షాక్..

పెళ్లి చేసుకుందామని ఆ యువకుడికి చెబితే.. రేపు, మాపు అంటూ దాటవేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో రిజిస్టర్ మ్యారేజ్ అయినా చేసుకుందామని ప్రతిపాదన తీసుకొస్తే. దానికి ఓకే చెప్పాడు. ఇదే సమయంలో రిజిస్టర్ మ్యారేజ్ ఏంటి? అని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 4, 2024 / 01:10 PM IST

    Bihar

    Follow us on

    Bihar: ఆమె ఓ డాక్టర్.. వయసు 28 సంవత్సరాల దాకా ఉంటుంది. ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఆమెకు ఓ యువకుడు పరిచయమయ్యాడు. అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడింది. ఇలా ఐదు సంవత్సరాలుగా వారి వ్యవహారం కొనసాగుతోంది. ఇదే విషయాన్ని ఆ డాక్టర్ తన ఇంట్లో చెప్పింది. ” చేసుకుంటే అతన్నే చేసుకుంటాను.. లేకపోతే చస్తాను. నాకు మాత్రం పెళ్లి సంబంధాలు చూడొద్దని” చెబితే.. ఇంట్లో వాళ్ళు కూడా ఆమె నిర్ణయానికి వదిలేశారు.

    అతని మీద ఉన్న నమ్మకంతో ఆ డాక్టర్ ఇంట్లో తెగేసి మరీ చెప్పింది కాని.. పెళ్లి చేసుకుందామని ఆ యువకుడికి చెబితే.. రేపు, మాపు అంటూ దాటవేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో రిజిస్టర్ మ్యారేజ్ అయినా చేసుకుందామని ప్రతిపాదన తీసుకొస్తే. దానికి ఓకే చెప్పాడు. ఇదే సమయంలో రిజిస్టర్ మ్యారేజ్ ఏంటి? అని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. “ఘనంగా పెళ్లి చేద్దామనుకుంటే, ఇలా చేస్తున్నావ్ ఏంటని” ఆ డాక్టర్ ను ప్రశ్నించారు. అయితే ఆమె తనకు అలానే ఇష్టం అని చెప్పడంతో.. వారు కూడా చేసేది ఏమీ లేక ఒప్పుకున్నారు. రిజిస్టర్ మ్యారేజ్ కు అన్ని ఏర్పాట్లు చేసి.. ఆ డాక్టర్ తన కుటుంబ సభ్యులతో రిజిస్ట్రార్ ఆఫీస్ కు వెళ్తే.. ఆ యువకుడు అక్కడికి వెళ్లకుండా ఆ డాక్టర్ కు హ్యాండ్ ఇచ్చాడు. దీంతో ఆ డాక్టర్ కు కోపం తారాస్థాయికి చేరింది.

    తన కుటుంబ సభ్యులను ఇంటికి పంపించి.. ఆ డాక్టర్ నేరుగా తన ప్రియుడి ఇంటికి వెళ్ళింది. ఎందుకు రాలేదని నిలదీస్తే.. అతడు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. చివరికి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకున్నావ్ అని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో ఆ డాక్టర్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే రెండో మాటకు తావు లేకుండా అతడి ప్రైవేట్ పార్ట్ కట్ చేసింది. తీవ్ర రక్తస్రావంతో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. బీహార్ రాష్ట్రంలోని శరణ్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ జిల్లాకు చెందిన ప్రకాష్ అనే యువకుడు ఓ యువ మహిళా డాక్టర్ తో ఐదు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాడు. పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తీసుకొస్తుంటే దాటవేస్తున్నాడు. చివరికి రిజిస్టర్ మ్యారేజ్ కు ఒప్పుకున్నాడు. చివరి నిమిషంలో ఆ మహిళా డాక్టర్ కు హ్యాండ్ ఇవ్వడంతో.. ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. ఆ డాక్టర్ పై బాధిత యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ డాక్టర్ కూడా తనను ప్రేమించి పెళ్లి చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు కేసు విచారణ కొనసాగిస్తున్నారు.