Relationship: రిలేషన్ లలో పొసెసివ్ నెస్ ఉంటుంది. పార్టనర్ తమకు మాత్రమే చెందాలని.. వారితో మాత్రమే ఉండాలని కొరుకుంటారు. ఇలాంటి వారు వారి ఇష్టపడేవారిని కంట్రోల్ చేయాలి అనుకుంటారు. ఒంటరిగా ఎక్కడికి వెళ్లనివ్వరు. ఎవరితో మాట్లాడనివ్వరు. దూరంగా అసలు పంపించరు. అయితే ఒకరికి పార్టనర్ అవ్వాలి అనుకోవడం, ఒకరిని సొంతం చేసుకోవాలి అనుకోవడం ఈ రెండింటిలో తేడా ఉంటుంది. అయితే పొసెసివ్ నెస్ వల్ల వీరిని భరించలేక లేక కొందరు చెప్పింది వినడం లేదని వారు ఎవరో ఒకరి వల్ల గొడవలు జరిగి విడిపోతుంటారు.
మరి ఈ ఫీలింగ్ ను ఎలా దూరం చేసుకోవాలి? ఇంతకీ ఈ రిలేషన్ షిప్ లో అతి అటాచ్ మెంట్ ఎందుకు ఏర్పడుతుంది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వస్తువును వదిలివేసినప్పుడు మరొక వస్తువు పట్టుకోవాలి అనిపిస్తుందట. అయితే జీవితంలో అసంతృప్తి కలిగినప్పుడే ఈ ఫీలింగ్ వస్తుంది అంటున్నారు నిపుణులు. ఒక వేళ మీకు ‘పొసెసివ్‌నెస్ ఉంటే దాన్ని వదిలివేయడమే బెటర్. దీనికంటే ఎవరినైనా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాలట. సాధ్యమైనంత కంట్రోల్ చేయాలట.
అయితే ఒకరిని/ ఒక వస్తువును మీరు నియంత్రించడానికి ప్రయత్నించడం వల్ల కలిగే బాధను గుర్తిస్తే.. ఆ బాధే మిమ్మల్ని పొసెసివ్‌నెస్ భావం నుంచి నయం చేస్తుందని అంటున్నారు నిపుణులు. ఎవరిని అయినా పూర్తిగా కంట్రోల్ చేయాలంటే వారి మీద ఒక కన్నేసి ఉంచాలి. అంటే అటోమెటిక్ గా మీకు చిరాకు, ఒత్తిడి, అలసట వస్తుంది. ఇలా ఒకరిని కోల్పోతామని అనుకుంటే ఆందోళన కలుగుతుంది. ఎవరిని అయినా కంట్రోల్ చేస్తే ఒకరోజు వారు ఎదురు తిరుగుతారు. వారితో గొడవ కూడా జరుగుతుంది. దీనివల్ల బాధ పడతారు.
అందుకే కంట్రోల్ బిహేవియర్ మీకు ఉంటే రిలేషన్ దెబ్బతినడమే కాకుండా వారు దూరం కూడా అవుతారు. నిత్యం కంట్రోల్ చేస్తే ఒక గిల్ట్ ఫీలింగ్ కలుగుతుంది. వారి మీద వారికి అసహనం, ఆగ్రహం కలుగుతుంది. దీంతో ఆ ఫీలింగ్ నుంచి ఆటోమెటిక్‌గా బయటపడతారు.