https://oktelugu.com/

Crime News : పాఠాలు చెప్పే టీచర్ పై కన్నేశాడు.. పెళ్లికి ఒప్పుకోకపోయేసరికి ఎంతటి దారుణానికి ఒడిగట్టాడంటే..

సభ్య సమాజంలో మనుషుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. ఎన్ని ఘటనలు జరిగినా.. ఎలాంటి శిక్షలు విధిస్తున్నా అలాంటివారిలో మార్పు రావడం లేదు. పైగా ఇటువంటి ఘటనలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఓ దారుణం సభ్య సమాజంలో పెడపోకడలను సూచిస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : November 20, 2024 6:38 pm
Crime News

Crime News

Follow us on

Crime News :  ఆమె పేరు రమణి.. వయసు 30 సంవత్సరాల లోపు ఉంటుంది. ఆమె తంజావూర్ జిల్లాలో మల్లి పట్టణం లోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. పేద కుటుంబం నుంచి రావడం.. కష్టపడి చదువుకోవడం.. టీచర్ గా ఉద్యోగం సంపాదించడం తో రమణికి మంచి పేరు ఉండేది. పైగా ఆమె చెప్పే పాఠాలను విద్యార్థులు శ్రద్ధగా వినేవారు.. అయితే ఆమెను ప్రేమ పేరుతో మదన్ అనే యువకుడు కొన్ని సంవత్సరాలుగా వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని పదేపదే అడుగుతున్నాడు. దీనికి ఆమె నిరాకరిస్తూ వస్తోంది. పలు సందర్భాల్లో అతనికి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ విషయం పెద్దలు దాకా వెళ్ళింది. వారు పలు మార్లు మదన్ ను హెచ్చరించారు. అయితే పోలీసులకు చెబితే పరువు పోతుందని భావించి.. వారు ఫిర్యాదు చేయకుండా ఉండిపోయారు. అయితే ఇదే అదునుగా మదన్ రెచ్చిపోయాడు. రమణిని మరింత వేధించడం మొదలుపెట్టాడు. బుధవారం ఆమె తరగతి గదిలో పాఠాలు చెబుతుండగా అకస్మాత్తుగా తరగతి గదిలోకి ప్రవేశించాడు. ముందు ఆమెతో వాదనకు దిగాడు. ” నన్ను ఎందుకు ప్రేమించవు? ఎందుకు నన్ను పెళ్లి చేసుకోవు? నేను అందంగా లేనా? ఎన్ని రోజులు మీ చుట్టూ తిరగాలి? ఎన్నిసార్లు నిన్ను అడగాలి? నన్ను ఎందుకు పట్టించుకోవు? మీ పెద్దవాళ్లతో చెప్పి వార్నింగ్ ఇచ్చావు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావ్” అంటూ వాదనకు దిగాడు. అయితే రమణి కూడా అతడిని వారించింది. విద్యార్థులకు పాఠాలు చెప్పే చోట ఇలాంటి వ్యవహారం సరికాదని అతడికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. దీంతో సహనం కోల్పోయిన మదన్.. తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో రమణి పై దాడి చేశాడు. ఆమె ఆ దాడిలో తీవ్రంగా గాయపడింది. నెత్తుటి మడుగులో కొట్టుకుంటుండగా సిబ్బంది చూసి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా మృతి చెందింది.

మల్లి పట్టణంలో కలకలం

ఉపాధ్యాయురాలి పై తరగతి గదిలో కత్తితో దాడి చేసి చంపిన ఘటన మల్లి పట్టణంలో కలకలం సృష్టించింది. ఇది తమిళనాడు వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ విషయం తెలియడంతో ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా స్పందించారు. వెంటనే పోలీసులను ఆదేశించి.. నిందితుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.. రమణి ప్రేమోన్మాది దాడిలో చనిపోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఇక విద్యార్థులైతే రమణి మృతిని తట్టుకోలేకపోతున్నారు. ” మేడం మాకు పాఠాలు చెబుతున్నారు. ఇంతలోనే మదన్ వచ్చాడు. మేడం తో వాగ్వాదానికి దిగాడు. మేడం అతడిని వారించింది. అయినప్పటికీ అతడు తన ధోరణి మార్చుకోలేదు. పైగా అంతకంతకు మేడంతో వివాదాన్ని పెంచుకున్నాడు. సహనం కోల్పోయి పదునైన కత్తితో మేడం పై దాడి చేశాడు. మేము చూసుకుండగానే మేడం కిందపడిపోయారు. రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకున్నారు. స్కూల్ లో పని చేసే సిబ్బంది వచ్చి మేడాన్ని హాస్పిటల్ తీసుకెళ్లేలోపే ఆమె చనిపోయారని” విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతూ పేర్కొన్నారు. ఐతే రమణి ని చంపిన మదన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తున్నారు.. ప్రభుత్వం ఈ కేసును అత్యంత సీరియస్ గా తీసుకుంది. తరగతి గదిలో టీచర్ ను చంపడాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నా డీఎంకే నేతలు మండిపడుతున్నారు.