Pawan Kalyan In Assembly:అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుకు మాట ఇస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు విజన్ ప్రకారం పని చేస్తామని.. సీఎం కలలను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. చంద్రబాబు ఐదేళ్లు కాదు మరో పదేళ్లు సీఎంగా ఉండాలని.. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని చంద్రబాబు కోరారు. చంద్రబాబు ఈ ఐదేళ్లు కాదు మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. సంకీర్ణ ప్రభుత్వం 150 రోజుల పరిపాలనపై ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టినందుకు సీఎంకు పాదాభివందనం చేస్తున్నాని అన్నారు. సంక్షోభం వస్తే నాయకుడు ఎలా ఉండాలో చంద్రబాబు నిరూపించారని అన్నారు. బుడమేరు వరద సమయంలో ఆయన చూపిన చొరవ అమోఘం అని కొనియాడారు. ఆఫీసులో కూర్చొని ఆదేశాలు ఇచ్చే సత్తా ఉన్నప్పటికీ ప్రజల్లో, అధికారుల్లో ధైర్యం నింపేందుకు బురదలో తిరిగారన్నారు. ప్రభుత్వం నుంచి శిథిలమై పోయిన రోడ్లు, గంజాయి, ఇసుక దోపిడీలు రివర్స్ టెండరింగులు, నిర్వీర్యం అయిపోయిన పంచాయతీలు, ఆలయాల్లో అపవిత్రం, మద్యం దోపిడీలు, వారసత్వంగా వచ్చే అని పేర్కొన్నారు.
అసెంబ్లిలో తన ప్రసంగంలో సమర్థుడైన నాయకుడు ఉంటే ఎలా ఉంటుందో చూడొచ్చు అని ముఖ్యమంత్రి చంద్రబాబును కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఉండడానికి ముఖ్య కారణం చంద్రబాబేనని, విజయవాడ వరదల సమయంలో సాగించిన పరిపాలన తీరు ప్రశంసనీయం అని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుడమేరు ముంపునకు గురైందని.. సంకీర్ణ ప్రభుత్వంలో ప్రతినెలా 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు ఈ ప్రభుత్వానికి సవాల్ గా మారాయని, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పని చేశామన్నారు. మరో పదేళ్లు పవన్ చంద్రబాబే సీఎం అని ప్రకటించడం సహజంగానే రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా పవన్ సీఎం అవుతాడన్న నమ్మకంతో జనసైనికులు ఉన్నారు. కానీ రాష్ట్రానికి చంద్రబాబు అవసరం అని పవన్ అంటున్నారు. అందుకే మరో పదేళ్లు చంద్రబాబు సీఎంగా కొనసాగాలని అంటున్నారు. మరికొందరు ఈ మాటలన్నీ ప్రస్తుత ప్రభుత్వంపై విశ్వాసం అంటే కూటమిపై విశ్వాసం మాత్రమేనని వాదిస్తున్నారు.
కారణం ఏదైనా సరే చంద్రబాబు నాయకత్వంపై పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ఉన్నారు. ఎక్కడా ఎలాంటి ఊహాగానాలకు అనుమతి లేదు. ఇటీవలి కాలంలో హిందుత్వ నినాదాన్ని తీసుకుని జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకునేందుకు పవన్ చేస్తున్న వ్యాఖ్యలు సహజంగానే హాట్ టాపిక్ అవుతున్నాయి. మరో ఐదేళ్ల తర్వాత చంద్రబాబుకు వృద్ధాప్యం రావచ్చు. తనను సీఎంగా చేసిన పవన్ కు తన కుర్చీ త్యాగం చేయవచ్చన్న ఆశనే ఏమో కానీ పవన్ మనసులోని ఈ కోరిక మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. సీఎం సీటు వద్దు బాబే ముద్దు అనడం వరకూ ఓకే కానీ వృద్ధాప్యంతో బాబు మరో పదేళ్లు సేవ చేయగలడా లేదా అన్నది డౌట్. ఎందుకంటే ఇప్పటికే 75 ఏళ్లు బాబుకు నిండాయి. సో పవన్ మాట ‘సిగ్గుతో కూడిన భయం వల్ల భక్తి వల్ల వచ్చిన గౌరవం కావచ్చు’ అని కొందరు సెటైర్లు వేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు ఇంకో పదేళ్లు సీఎంగా ఉండాలి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ pic.twitter.com/rROy9R9opB
— Telugu Scribe (@TeluguScribe) November 20, 2024