Five Marriages Fraud: ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకుంది. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంది. ఒక చోట ఒక పేరు, మరో చోట మరో పేరు..ఇలా పేర్లు మార్చుకుని అందరినీ ఏమార్చింది. పైగా మోసం చేయడంలో కొత్త దారులను అవలంబించింది. ఇలా ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకున్న ఈమె బండారం బయట పడింది. ఆమె తీరు చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. శ్వేత, కీర్తి, మణి..ఈ పేర్లు మొత్తం ఆమెవే. వయసు 27సంవత్సరాలు ఉంటుంది. ఈమెది తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపుడి.
వజ్రపు మణి ది మొదటినుంచి కూడా విచ్చలవిడి వ్యక్తిత్వం. టీనేజ్ లోనే ఈమె వ్యవహారాలు తార స్థాయి చేరడంతో తల్లిదండ్రులు 2025లో పెద్ద మడుగురులోని కాశేపల్లి కి చెందిన సుధీర్ రెడ్డిని ఈమె వివాహం చేసుకుంది. కొద్దిరోజులపాటు అతనితో బాగానే ఉంది. ఆ తర్వాత అతడికి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో సుధీర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు పెద్దవడుగూరు లో కేసు నమోదు చేశారు.
మణి అక్కడినుంచి కర్ణాటక వెళ్ళిపోయింది. అక్కడ మల్లె కుప్పం ప్రాంతంలో ఒక యువకుడికి దగ్గర అయింది. తనకు ఎవరూ లేరని అతని వద్ద నమ్మబలికింది. అతడికి పెళ్లి కాకపోవడం.. ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడంతో దొరికింది చాన్స్ అనుకుని పెళ్లి చేసుకున్నాడు.. అతడితో ఆరు రోజులు గడిపింది. సరిగ్గా ఆరు రోజుల తర్వాత మదనపల్లె వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. చీకల బైలు వద్ద ఆమెను అరెస్ట్ చేశారు.
మణి కి కేవలం ఈ రెండు మాత్రమే కాదు.. అంతకుముందు మూడు వివాహాలు జరిగాయి. విజయవాడ నగరానికి చెందిన సుమప్రియ.. అశోక్.. శశికళ.. రామకృష్ణ అనే వ్యక్తులతో కలిసి ఈయన చేతులు కలిపింది. వీరిని మధ్యవర్తులుగా నియమించుకుంది. తనకు ఎదురు కట్నం వచ్చేలాగా పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేది. అత్యంత గ్రాండ్ గా పెళ్లి చేసుకునేది. తనకు ఎవరూ లేరని.. నమ్మబలికేది. అంతేకాదు మధ్యవర్తులను దూరపు బంధువులుగా పరిచయం చేసేది. ఆ తర్వాత తనకు ఆస్తులు ఉన్నాయని చెప్పేది. డబ్బులు.. బంగారం వసూలు చేసేది. ఆ తర్వాత కొద్ది రోజులకే అక్కడ నుంచి పారిపోయేది.
తను ఉపయోగించే సిమ్ కార్డులను వెంటనే మార్చేసేది ఆ సిమ్ కార్డులను కూడా వేరే వ్యక్తుల పేరు మీద తీసుకునేది. అందువల్లే పోలీసులకు దొరకకుండా.. తాను మోసం చేసిన వారికి చిక్కకుండా తప్పించుకునే. అయితే సుధీర్ రెడ్డి ఈమె గురించి వెతకడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఆమె కదలికలపై దృష్టి పెట్టడంతో.. చివరికి దొరికిపోయింది. నేటి కాలంలో వివాహాలు జరగక చాలామంది యువకులు ఇబ్బంది పడుతుంటే.. ఈమె మాత్రం ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకుంది. డబ్బులు, బంగారం లాగి ఎస్కేప్ అయ్యేది.
