Homeఅంతర్జాతీయంModi Seychelles Visit: ఇప్పటికిప్పుడు నరేంద్ర మోడీ సీషెల్స్ ఎందుకు వెళ్లినట్టు.. గట్టి ప్లానే వేశారుగా..

Modi Seychelles Visit: ఇప్పటికిప్పుడు నరేంద్ర మోడీ సీషెల్స్ ఎందుకు వెళ్లినట్టు.. గట్టి ప్లానే వేశారుగా..

Modi Seychelles Visit: ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ దేశానికైనా సరే మరొక దేశంతో దౌత్య సంబంధం అత్యంత అవసరం. ఎందుకంటే ప్రపంచంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఏ దేశంతో ఎలాంటి సందర్భంలో అవసరం ఏర్పడుతుందో తెలియడం లేదు. అందువల్లే దౌత్య సంబంధాల కోసం ఆయా దేశాల అధినేతలు విదేశాలలో పర్యటిస్తున్నారు. ఈ జాబితాలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ మొదటి స్థానంలో ఉంటారు.

Also Read: అమెరికా కంటే భారత్‌ బెటర్‌.. అన్ని దేశాలకు దీంతో అర్థమైంది

ఇటీవల ఆయన ఫ్రాన్స్ దేశంలో పర్యటించారు. ఇప్పుడు హిందూ మహాసముద్రంలో అత్యంత కీలకమైన సీ షెల్స్ దేశం వెళ్లారు. వాస్తవానికి ఈ దేశం జనాభా చాలా తక్కువ.. గట్టిగా కొడితే 1,40,000 కూడా ఉండదు. ఈ దేశానికి తలసరి ఆదాయం 14,80,000 వరకు ఉంటుంది.. ఈ దేశానికి రాజధానిగా విక్టోరియా నగరం ఉంటుంది. చైనీస్.. ఇండియా.. ఆఫ్రికన్.. బ్రిటిష్.. ఫ్రెంచ్ సంతతికి సంబంధించిన ప్రజలు ఇక్కడ ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. మెజారిటీ ప్రజలు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తుంటారు. ఇక్కడ 5.4% మంది హిందువులు ఉన్నారు. ఇందులో నాలుగు వేలమంది తమిళులు ఉన్నారు.

సీ షెల్స్ దేశానికి నరేంద్ర మోడీ వెళ్ళడానికి ఒక కారణం ఉంది. ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హేర్మని ఆహ్వానం మేరకు ఆయన
సీ షెల్స్ వెళ్లిపోయారు. సీ షెల్స్ 50వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నరేంద్ర మోడీ అక్కడికి వెళ్లారు. మూడు రోజులపాటు అక్కడ ఉంటారు..సీ షెల్స్ భారత్ మధ్య ఏకంగా దౌత్య సంబంధాలు ఏర్పడి 50 సంవత్సరాలు అవుతోంది. అందువల్లే నరేంద్ర మోడీ ఈ కీలక పర్యటన సాగిస్తున్నారు.

సీ షెల్స్ అధ్యక్షుడితో నరేంద్ర మోడీ ద్వైపాక్షిక చర్చలు సాగిస్తారు.. డిఫెన్స్, ట్రేడ్, బ్లూ ఎకానమీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటిల్లో చర్చలు సాగిస్తారు.

హిందూ మహా సముద్రంలో చైనా దూకుడు కొనసాగిస్తున్న నేపథ్యంలో.. డ్రాగన్ దేశాన్ని నిలువరించడానికి సీ షెల్స్ సహకారం భారతదేశంలో చాలా అవసరం.. మరోవైపు భారత్ నిర్వహిస్తున్న విజన్ మహాసాగర్.. గ్లోబల్ సౌత్ లో సీ షెల్స్ అత్యంత ముఖ్యమైన భాగస్వామి.. అంతేకాదు, సీ షెల్స్ భాగస్వామ్యంతో నిర్మించిన జాయింట్ సీ షెల్ కింద ఏర్పాటుచేసిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నరేంద్ర మోడీ ప్రారంభించారు. గస్తీ నౌకను సీ షెల్స్ దేశానికి మోడీ అందించారు.. ఇక్కడ భారతీయులతో నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సమావేశం అవుతారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version