https://oktelugu.com/

Actor Darshan: అభిమానిని చంపిన హీరో కేసులో ఒళ్లు జలదరించే నిజాలు.. ఫుల్‌ స్టోరీ ఇదీ

తన ప్రియురాలు పవిత్రగౌడకు దర్శన్‌ అభిమాని రేణుస్వామి ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర పోస్టులు పెడుతున్నాడు. దర్శన్‌–విజయలక్ష్మి దంపతుల జీవితంలో నుంచి వెళ్లిపోవాలని వేధిస్తున్నాడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 21, 2024 / 12:26 PM IST

    Actor Darshan

    Follow us on

    Actor Darshan: కన్నడ సినీనటుడు దర్శన్, అతడి గ్యాంగ్‌ చేతిలో హత్యకు గురైన చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన నటుడు దర్శన్, అతని ప్రియురాలు పవిత్రగౌడతోపాటు మరో 17 మందిని బెంగళూరు సిటీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. దర్శన్‌తోపాటు ఆయన ప్రియురాలు పవిత్రగౌడ, మిగతా నిందితులను పోలీసులు విడివిడిగా విచారణ చేస్తున్నారు. ఇందులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.

    ప్రియురాలికి అసభ్యకర పోస్టు పెట్టినందుకు..
    తన ప్రియురాలు పవిత్రగౌడకు దర్శన్‌ అభిమాని రేణుస్వామి ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర పోస్టులు పెడుతున్నాడు. దర్శన్‌–విజయలక్ష్మి దంపతుల జీవితంలో నుంచి వెళ్లిపోవాలని వేధిస్తున్నాడు. దీంతో పవిత్ర ఈ విషయాన్ని దర్శన్‌ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆగ్రహానికి గురైన హీరో.. తన అభిమానిని జూన్‌ 9న బెంగళూరుకు పిలిపించి తన అభిమానుల సంఘం సభ్యులతో కలిసి చిత్ర హింసలకు గురిచేసి చంపేశాడు. తర్వాత మృతదేహాన్ని డ్రెయినేజీలో పారేశారు. రేణుస్వామి సున్నిన ప్రాంతంలో దర్శన్‌ తన్నడంతోనే మృతిచెందాడని పోలీసుల విచారణలో తేలింది.

    హత్య తర్వాత భార్య ప్లాట్‌కు..
    ఇక హత్య తర్వాత దర్శన్‌ భార్య విజయలక్ష్మి ప్లాట్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి మైసూర్‌ బయల్దేరే ముందు ఇంట్లో పూజలు చేశాడు. ఈ నేపథ్యంలో ఇందులో భార్య ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విజయలక్ష్మికి నోటీసుల జారీ చేశారు. ఇక హత్య సమయంలో దర్శన్‌ ధరించిన లోవర్స్‌ విజయలక్ష్మి ఇంట్లోనే వదిలేశాడు. దంతో వాటిని ఎవరు కడిగారని ఆరా తీశారు. హత్య అనంతరం దర్శన్‌ దుస్తులు, ఫుట్‌వేర్, అతని అసిస్టెంట్‌ రాజు విజయలక్ష్మికి ఇచ్చారని పోలీసులు గుర్తించారు.

    పోస్టుమార్టం రిపోర్టు మార్చేందుకు..
    ఇక, రేణుకాస్వామి పోస్టుమార్టం రిపోర్టును తారుమారు చేసేందుకు దర్శన్‌ డబ్బు ఎర వేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి దినేష్‌ ఈ విషయంలో చేసిన వ్యాఖ్యలతో హీరో దర్శన్‌ టీమ్‌ ఉలిక్కిపడింది. రేణుకాస్వామి పోస్టుమార్టం నివేదికను తారుమారు చేసేందుకు డబ్బు ఆఫర్‌ చేసినట్లు తన దృష్టికి రాలేదని మంత్రి దినేష్‌ గుండూరావ్‌ తెలిపారు. అయితే అలాంటిదేమైనా ఉంటే విచారణ జరిపిస్తామన్నారు. ఈ కేసును విచారించేందుకు తమను ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేదని మంత్రి స్పష్టం చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. తప్పు చేసిన వాళ్లకు కచ్చితంగా శిక్ష పడాలన్నని పేర్కొన్నారు.

    నేరస్తులను రక్షించం..
    ఇదిలా ఉండగా, రేణుకాస్వామి హత్య కేసు నుంచి హీరో దర్శన్‌తోపాటు ఆయన గర్ల్‌ ఫ్రెండ్‌ పవిత్ర గౌడను రక్షించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. హీరో దర్శన్‌ను రక్షించాలని తమను ఎవరూ కలవలేదని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మండ్య నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి స్టార్‌ చంద్రును గెలిపించాలని హీరో దర్శన్‌ ప్రచారం చేశారు. దీంతో దర్శన్‌ను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    ఫ్యాన్‌ క్లబ్‌పై పోలీసుల దృష్టి..
    రేణుస్వామి హత్య కేసులో దర్శన్‌ ఫ్యాన్స్‌ క్లబ్‌లోని వారు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇప్పుడు పోలీసుల ఫ్యాన్స్‌ క్లబ్‌ కార్యకలాపాలపై దృష్టి పెట్టారు. ఫ్యాన్స్‌కు దర్శన్‌తోపాటు, అతని దర్శక నిర్మాతల నుంచి ఆకర్షణీయమైన మొత్తాలు అందుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హత్య కేసుతో సంబంధం ఉన్నవారినీ గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.