Pat Cummins: టి20 వరల్డ్ కప్ లో భాగంగా అన్ని జట్లు కూడా తమదైన రీతిలో వరుస విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక అందులో ఆస్ట్రేలియా టీం అయితే వన్డే వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎలాంటి ఫామ్ ను అయితే చూపించిందో ఇప్పుడు కూడా అలాంటి ఫామ్ తో ముందుకు సాగుతుంది. ఇక ఇప్పుడు ఆడుతున్న సూపర్ 8 లో భాగంగా ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ తో ఆడిన మొదటి మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీమ్ ని ఆస్ట్రేలియా పేస్ బౌలర్ అయిన పాట్ కమ్మిన్స్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఈ మ్యాచ్ లో తను హ్యాట్రిక్ వికెట్లు తీసి బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు. ఇక 2007 వ సంవత్సరంలో ఆడిన తొలి టి 20 వరల్డ్ కప్ లో బ్రేట్లి బంగ్లాదేశ్ మీద హ్యాట్రిక్ పడగొట్టాడు.
ఇక ఇప్పుడు కమ్మిన్స్ కూడా అదే బంగ్లాదేశ్ మీద మరోసారి హ్యాట్రిక్ ని తీసి ఒక హిస్టరీని క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు మొత్తం టి20 వరల్డ్ కప్ లో ఏడు హ్యాట్రిక్ లు నమోదు అయ్యాయి. ఇక ఇదిలా ఉంటే 18 ఓవర్లో బౌలింగ్ చేసిన పాట్ కమ్మిన్స్ చివరి రెండు బంతులకు మహమ్మదుల్లా, మోహాది హాసన్ ఇద్దరిని ఔట్ చేశాడు… ఇక ఆ తర్వాత ఓవర్లో బౌలింగ్ కి వచ్చినప్పుడు హృదయ్ ని అవుట్ చేసి హ్యాట్రిక్ ను నమోదు చేసుకున్నాడు…
Also Read: Kane Williamson: సెంట్రల్ కాంట్రాక్ట్ తిరస్కరణ పై.. కేన్ విలియమ్సన్ కీలక వ్యాఖ్యలు..
ఇక కమ్మిన్స్ దెబ్బకి బంగ్లాదేశ్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లకి 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన ఆస్ట్రేలియా టీమ్ 11.2 ఓవర్లకు 2 వికెట్లను కోల్పోయి 100 పరుగులు చేసింది. ఇక అప్పటికే వర్షం రావడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిచినట్టుగా ప్రకటించారు. ఇక ఆస్ట్రేలియా ఓపెనర్ అయిన వార్నర్ 53 పరుగులతో ఒక హఫ్ సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు…
Also Read: Jasprit Bumrah: బుమ్ బుమ్ బుమ్రా.. బౌలింగ్ కు క్రికెట్ దిగ్గజాల ఫిదా
ఇక ఇదిలా ఉంటే ప్యాట్ కమ్మిన్స్ హ్యాట్రిక్ వికెట్లు తీయడంతో ఇండియన్ టీమ్ కి ఒక సెంటిమెంట్ అయితే కలిసివచ్చే విధంగా కనిపిస్తుంది. అది ఏంటి అంటే 2007వ సంవత్సరంలో బ్రెట్లి బంగ్లాదేశ్ మీద హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఇక ఆ సంవత్సరం టి20 వరల్డ్ కప్ లో ఇండియా విజేతగా నిలిచి ట్రోఫీ ని అందుకుంది. ఇక ఇప్పుడు కూడా పాట్ కమ్మిన్స్ హ్యాట్రిక్ తీశాడు కాబట్టి ఇప్పుడు కూడా ఇండియా టి 20 వరల్డ్ కప్ లో ట్రోఫీ గెలువబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే విపరీతంగా వైరల్ అవుతుంది… చూడాలి మరి ఈ సెంటిమెంట్ మరోసారి వర్కౌట్ అవుతుందా లేదా అనేది…