Modi promoting an investment scheme: డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతోంది. డబ్బుంటేనే ఈ సమాజం విలువ ఇస్తుంది. అందువల్లే ఆ డబ్బు కోసం మనుషులు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు.. ఆ డబ్బుల కోసం ఎన్ని పనులైనా చేస్తారు.. అయితే డబ్బు సంపాదనకు సులువైన మార్గాలు వస్తే ఎవరూ వదిలిపెట్టారు. పైగా ఆ మార్గాలలో డబ్బులు సంపాదించాలని చూస్తుంటారు. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటుంది.. కష్టపడి సంపాదించింది ఎన్నడూ వదిలిపెట్టి పోదు. కష్టపడకుండా వచ్చింది ఎంత ప్రయత్నించినా నిలబడదు.
కరెన్సీ చుట్టూ ప్రపంచం చక్కర్లు కొడుతోంది కాబట్టి.. డబ్బు సంపాదిస్తేనే సొసైటీ విలువ ఇస్తోంది కాబట్టి.. డబ్బు సంపాదన కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. రాత్రికి రాత్రి డబ్బులు భారీగా సంపాదించాలని.. సమాజంలో గొప్ప వ్యక్తులుగా ఎదిగిపోవాలని చాలామంది అనుకుంటుంటారు.. ఇందుకోసం ఎత్తులు, జిత్తులు వేస్తుంటారు. వెనుకటి కాలంలో ఇలా ఆయాచితంగా డబ్బులు సంపాదించడానికి కొంతమంది వ్యక్తులు ఘోరాలకు, దారుణాలకు, దొంగతనాలకు ఇతర నేరాలకు పాల్పడేవారు. కానీ నేటి స్మార్ట్ కాలంలో అలాంటివి జరగడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో సులువుగా డబ్బు సంపాదించడానికి కొంతమంది వ్యక్తులు వైట్ కాలర్ నేరగాళ్ల అవతారం ఎత్తారు. మాయమాటలతో.. రెండవ కంటికి తెలియకుండా బురిడీ కొట్టించే ప్రయత్నాన్ని విజయవంతంగా చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు ఏకంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తమ మోసానికి పావులుగా వాడుకుంటున్నారు.
Also Read: సేవకు బహుమానం యూట్యూబ్ ఛానల్ ఉదాహరణగా!
దేశ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. వాటిని విజయవంతంగా అమలు చేస్తున్నది. అయితే ఆ పథకాల మాటున కొంత మంది సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్నారు. నేటి టెక్నాలజీ కాలంలో రకరకాల సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకుంటూ ప్రజలను మోసం చేయడానికి పన్నాగాలు రూపొందించారు. డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నట్టు వీడియోల రూపొందించారు. కేవలం 21 వేలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే.. డైలీ 1.25 లక్షల ఇన్ కం పొందే విధంగా పథకాన్ని తీసుకొచ్చినట్టు వీడియోను రూపొందించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో.. వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. తమ అడ్డగోలు సంపాదనకు నరేంద్ర మోడీ మాట్లాడినట్టుగా సృష్టించిన డీప్ ఫేక్ వీడియోను వాడుకుంటున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి మాట్లాడాడు అని చెబుతూ.. పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. వారు చెప్పిన మాటలు నమ్మి గృహిణులు, సీనియర్ సిటిజెన్లు డబ్బులు పెట్టుబడి పెడుతున్నారు. నిండా మునిగిన తర్వాత మోసం తెలుసుకుని ల బోదిబోమంటున్నారు. ప్రధానమంత్రి మాట్లాడినట్టుగా డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా రూపొందించిన వీడియోను పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. అలాంటి స్కీం లేదని.. అదంతా ఫేక్ వీడియో అని.. ఇటువంటి వాటిని ప్రజలు నమ్మకూడదని సూచించింది.
“కేంద్రం అలాంటి స్కీం తీసుకురాలేదు. అయినా వేలల్లో పెట్టుబడి పెట్టి.. రోజుకు లక్షల ఆదాయం ఎలా వస్తుంది. దీనిని ప్రజలు గమనించాలి. అత్యాశకు పోయి కొంపలు ముంచుకోవద్దు. సైబర్ నేరగాళ్లు రకరకాల మోసాలకు పాల్పడుతుంటారు. అటువంటి వ్యక్తులు చేసే ప్రకటనలు బురిడీ కొట్టించే విధంగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలను.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలను డీప్ ఫేక్ టెక్నాల ద్వారా రూపొందించి ఫేక్ వీడియోలను సైబర్ నేరగాళ్లు రూపొందిస్తున్నారు. అటువంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని” పోలీసులు సూచిస్తున్నారు.
View this post on Instagram