Nellore Aruna Audio Call Leak: ఒకప్పుడు నీతివంతమైన వ్యక్తులు రాజకీయాలు చేసేవారు. పరిపాలనలో కూడా తమదైన ముద్ర వేసేవారు. తద్వారా నేరాలు అంతగా ఉండేవి కావు. దారుణాలు అంతగా చోటు చేసుకునేవి కాదు. కానీ నేటి కాలంలో నేరమయ వ్యక్తులు రాజకీయాలు చేస్తున్నారు. వారి అనుచరులు అంతకుమించి ఆగడాలకు పాల్పడుతున్నారు. తద్వారా వ్యవస్థ మొత్తం సర్వనాశనం అవుతోంది. ప్రజాస్వామ్యానికి మకిలీ మట్టి.. దారుణాలు సర్వ సాధారణమవుతున్నాయి.
ఇటీవల నెల్లూరులో అరుణ అనే నేరమయ మహిళ ఆగడాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఏకంగా కరడు కట్టిన రౌడీ షీటర్ ను బయటికి విడిపించిన తీరు.. అంతకుముందు ఆమె చేసిన దారుణాలు.. అన్ని ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం అరుణ జైలు శిక్ష అనుభవిస్తున్నది. ఆమె జైల్లో ఉన్నప్పటికీ ఆగడాలు ఏమాత్రం తగ్గడం లేదు. అరుణకు అత్యంత దగ్గర వ్యక్తి అయిన శ్రీకాంత్.. మరో రౌడీషీటర్ జగదీష్ కు మధ్య జరిగిన ఆడియో కాల్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. అరుణ పేరు చెప్పగానే జగదీష్ మీద శ్రీకాంత్ ఒక్కసారిగా మండిపడ్డాడు. అరుణ తలను అంతం చేయడానికి ప్రయత్నిస్తోందని జగదీష్ వా పోతే.. మొత్తం నువ్వే చేసావ్ అంటూ జగదీష్ ను శ్రీకాంత్ తిట్టిపోశాడు. వీరిద్దరు మాట్లాడుకున్న మాటలకు సంబంధించిన ఆడియో కాల్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.
శ్రీకాంత్ అరుణకు అత్యంత దగ్గర వ్యక్తి. అతడి ద్వారానే ఆమె నెల్లూరులో నేరాలకు పాల్పడింది. బెదిరింపులు, సెటిల్మెంట్లు వంటివి చేసింది. ఒక హత్య కేసులో శ్రీకాంత్ 2019 లో అరెస్టయ్యాడు. మధ్యలో ఒకసారి జైలు నుంచి పారిపోయి వచ్చాడు. మళ్లీ పోలీసులు పట్టుకోవడంతో జైలుకు వెళ్లాడు. శ్రీకాంత్ జైల్లో ఉన్నప్పటికీ.. అతని అనుచరులతో అరుణ నెల్లూరులో సమాంతర వ్యవస్థను కొనసాగించారు. ఈనేపథ్యంలోనే ఆమెకు అడ్డుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను తొలగించుకోవడానికి అరుణ స్కెచ్ వేశారు. అధికారంలో తమ ప్రభుత్వం లేకపోయినప్పటికీ రకరకాల ప్రయత్నాలు చేసి మొత్తంగా శ్రీకాంత్ ను విడిపించుకుంది. ఆ తర్వాత శ్రీకాంత్ ద్వారా ఇద్దరు వ్యక్తులను లేపేయాలని స్కెచ్ వేసుకున్నప్పటికీ.. చివరి నిమిషంలో బెడిసి కొట్టింది. ఈ వ్యవహారంలో అరుణ జైలు పాలు అయినప్పటికీ.. ఇప్పటికీ ఆమె హవా తగ్గలేదు. పైగా ఆమె జైల్లో ఉండి రకరకాల నేరమయ కార్యకలాపాలకు పాల్పడుతుంది అని చెప్పడానికి శ్రీకాంత్, జగదీష్ మధ్య జరిగిన కాల్ సంభాషణ ఒక బలమైన ఉదాహరణ.
నెల్లూరు అరుణ కేసులో కొత్త ట్విస్ట్..
బయటకు వచ్చిన రౌడీషీటర్ శ్రీకాంత్, అతడి అనుచరుడు జగదీష్ ఆడియో కాల్
అరుణ పేరు చెప్పగానే జగదీష్ పై మండిపడ్డ శ్రీకాంత్
అరుణ తనను చంపడానికి ప్రయత్నిస్తోందన్న జగదీష్
అంతా నువ్వే చేశావ్ అంటూ జగదీష్ ను తిట్టిన శ్రీకాంత్ pic.twitter.com/iJ2TYXDxi6
— ChotaNews App (@ChotaNewsApp) September 10, 2025