New Phone: మార్కెట్లోకి త్వరలో ఐఫోన్ 17 సిరీస్ రాబోతుంది. ఇది అమెరికా, భారత్లో మాత్రమే రిలీజ్ అవనుంది. సెప్టెంబర్ 12 నుంచి ఆన్లైన్లో.. 19 నుంచి నేరుగా కొనుగోలు చేయవచ్చు. అయితే అమెరికాతో సమానంగా భారత్ లో ఐఫోన్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఏడాది 12 మిలియన్ల ఫోన్లు అమ్ముడుపోతున్నాయని అంచనా. ఐఫోన్ అనగానే కొందరు స్టేటస్ కోసం తీసుకుంటారు.. మరికొందరు దీని అవసరం కోసం తీసుకుంటారు.. ఇంకొందరు మాత్రం నలుగురి కోసమే తీసుకుంటూ ఐఫోన్ కు డిమాండ్ పెంచుతున్నారు. వాస్తవానికి ఐఫోన ను ఎవరు కొనుగోలు చేయాలి? కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలను అయితే గుర్తుపెట్టుకోవాలి.. అవి ఏంటంటే?
అమెరికాకు చెందిన ఆపిల్ సంస్థ ఐఫోన్ ను అమెరికాతో సమానంగా భారత్ లో మాత్రమే రిలీజ్ చేస్తోంది. అంటే ఇక్కడ మార్కెట్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణ కొనుగోలుదారుడు తనకు అవసరం ఉన్న వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తాడు. కానీ కొందరు ప్రెస్టేజ్ కోసం మాత్రమే కొనుగోలు చేస్తారు. అయితే ఈ ఐఫోన్ కొనుగోలు చేసేటప్పుడు వారి మనస్తత్వం ఎలా ఉన్నా.. వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఇటీవల గుడి ముందు బిక్షం ఎత్తుకునే ఒక అమ్మ ఐఫోన్ అమ్మే షాప్ లో కనిపించింది. తనతో పాటు తన కుమారుడు కూడా ఉన్నాడు. అంతకుముందు తన కుమారుడు తనకు ఐఫోన్ కావాలని తల్లితో మొరపెట్టుకున్నాడు. అయితే ఆ పరిస్థితి మనకు లేదు అని ఎంత చెప్పినా వినలేదు. దీంతో కుమారుడి మనసు బాధ పెట్టడం ఇష్టం లేక తన వద్ద ఉన్న డబ్బంతా పోగు చేసి.. ఐఫోన్ కొనుగోలు చేసేందుకు స్టోర్ లోకి వెళ్లారు. అయితే అక్కడ ఒక యూట్యూబర్ ఐఫోన్ ను వీరు కూడా కొనుగోలు చేస్తున్నారని.. వారికి సంబంధించిన వీడియో తీసి అప్లోడ్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. వాస్తవానికి ఆయన తీసింది ఐఫోన్ గురించి. కానీ ఇక్కడ వేరే విధంగా ప్రచారం అయింది.
ప్రతి ఇంట్లో ఇలా డబ్బులు లేకున్నా ఒక ఎమోషన్ కోసం.. సమాజంలో ప్రతిష్ట కోసం మాత్రమే ఎక్కువ శాతం ఐఫోన్ కొనుగోలు చేస్తున్నారని కొందరు కామెంట్ చేశారు. ఈ ఫోన్ ను కొందరు ఉద్యోగస్తులు అయితే ఈఎంఐ ఏర్పాటు చేసుకొని మరీ కొనుగోలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారి ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. మిగతా ఫోన్ల కంటే ఐఫోన్ లో కాస్త ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి. లుకింగ్ కూడా బాగుంటుంది. కానీ ఇది కొందరికి మాత్రమే అవసరం అని గుర్తించాలి. అంతేకాకుండా ఐఫోన్ ను కొనుగోలు చేయడానికి సరైన డబ్బు అదనంగా ఉంటే మాత్రమే కొనుగోలు చేయాలి. అలా లేకపోతే ఐఫోన్ ను కొనాల్సిన అవసరం లేదు అని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.