Karnataka: నేటి కాలంలో వివాహేతర సంబంధాలు సర్వ సాధారణంగా మారిపోతున్నాయి. రోజుకో తీరుగా దేశవ్యాప్తంగా దారుణాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ మనుషుల్లో మార్పు రావడం లేదు. పైగా తాత్కాలిక సంబంధాల కోసం దీర్ఘకాలిక అనుబంధాలను తెంచుకోవడానికి అటు మగవారు.. ఇటు ఆడవారు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. పైగా మరింత క్రూరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దారుణమైన ఘటనలకు పాల్పడుతున్నారు. అటువంటిదే ఈ ఘటన కూడా. కాకపోతే సరిగ్గా అదే సమయానికి 8 సంవత్సరాలకు కుమారుడు అటువైపుగా రావడంతో ఆ భర్త బతికిపోయాడు.
కర్ణాటక రాష్ట్రంలోని విజయపూర్ జిల్లా ఇండి తాలూకాలోని ఓ గ్రామంలో బీరప్ప, సునంద అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరికి 8 సంవత్సరాలకు కుమారుడు ఉన్నాడు. బీరప్పతో వివాహం జరిగి దశాబ్దం దాటుతున్నప్పటికీ.. సునంద అతని మీద అంతగా ప్రేమ చూపించేది కాదు. అదే గ్రామానికి చెందిన సిద్ధప్ప అనే వ్యక్తితో సునందకు సంబంధం ఉండేది. భర్త లేని సమయంలో సిద్దప్ప ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాడు. పైగా ఆమెతో సరస సల్లపాలు కొనసాగిస్తూ ఉండేవాడు. బీరప్ప మోతుబరి రైతు. అతడికి ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. అయినప్పటికీ సిద్ధప్ప అంటేనే సునంద కు ఇష్టం ఉండేది. ఇటీవల బీరప్పకు సునంద వ్యవహారం తెలిసింది. భార్యను మందలించాడు. పద్ధతిగా ఉంటానని నమ్మబలికింది. ఆ తర్వాత తన వ్యవహారం కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో బీరప్పను అంతం చేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే అర్ధరాత్రి ఆదమరచి నిద్రపోతున్న బీరప్పను చూసిన సునంద.. వెంటనే సిద్ధప్పకు ఫోన్ చేసింది. అతడు నేరుగా ఇంట్లోకి ప్రవేశించి.. సునంద దగ్గరికి వెళ్లాడు.
అతడిని అంతం చెయ్
సిద్ధప్ప తన వద్దకు రాగానే సునంద అతడిని కౌగిలిలో బంధించింది. ” మనమిద్దరం కలకాలం ఇలానే కలిసి ఉండాలంటే పడుకున్న ఆ వ్యక్తి మన ఇద్దరి మధ్య ఉండకూడదు. లేచి అతడిని చంపేసేయ్.. అంటూ చెప్పింది. దానికి సిద్ధప్ప తల ఊపాడు. బీరప్ప గుండెల మీద కూర్చుని ఊపిరి ఆడకుండా చేశాడు. ఈ పరిణామానికి బీరప్ప ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే తేరుకుని సిద్ధప్పను ప్రతిఘటించాడు. వారిద్దరి మధ్య జరిగిన పెనుగులాట వల్ల ఇంట్లో ఉన్న కూలర్ కింద పడిపోయింది. ఆ శబ్దానికి పక్క మంచంలో పడుకొని ఉన్న బీరప్ప 8 సంవత్సరాల కుమారుడు లేచి అటువైపుగా వచ్చాడు. దీంతో సిద్ధప్ప, సునంద పారిపోయారు. బీరప్పకు గాయాలు కావడంతో అతడిని విజయపుర ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న సునందన పోలీసులు పట్టుకొని బుధవారం అరెస్ట్ చేశారు. సిద్ధప్ప ఆచూకీ ఇంకా లభించలేదు.