https://oktelugu.com/

Kerala: భర్త స్నేహితుడితో మళ్లీ పెళ్లి.. ఇలా తయారవుతున్నారేంది సామీ..!

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. భారత దేశ వివాహ బంధానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. మన సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడానికి విదేశీయులు కూడా ఆసక్తి చూపుతున్నారు. కానీ, మనం మాత్రం నూరేళ్ల పంటను.. నూరేళ్ల మంటగా మార్చుకుంటున్నాం.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 6, 2024 / 02:38 PM IST

    Kerala

    Follow us on

    Kerala: వివాహబంధం.. అంటే వేద మంత్రాలు.. బంధు మిత్రులు.. అగ్ని సాక్షిగా ఇద్దరు ఒక్కటయ్యే వేడుక. దీనిని భారత సంప్రదాయంలో ఎంతో గౌరవం ఉంది. ఇప్పటికీ అనేక మంది దంపతులు కలిసి ఉంటున్నారు అంటే అది మన వివాహ వ్యవస్థ గొప్పదనమే. పాశ్చాత్య దేశాల్లో పెళ్లి ఒకరితో కాపురం మరొకరితో పిల్లలు ఇంకొకరితో అన్నట్లు ఉంటాయి. బంధాలు. కానీ మన వివాహ వ్యవస్థలో భర్త కోసం భార్య, భార్య కోసం భర్త కడవరకూ ఉంటారు. అంత గొప్పది మన వైవాహిక జీవనం. కానీ, కొన్నేళ్లుగా మన వివాహ వ్యవస్థలోకి పాశ్చాత్య సంస్కృతి చొరబడుతోంది. విద్య, విజ్ఞానం, స్వేచ్ఛ, ప్రేమ, రిలేషన్‌ షిప్‌ అంటూ అగ్రిమెంట్‌ పెళ్లి్లళ్లు జరుగుతున్నాయి. ఈ పెళ్లిళ్లు కడవరకూ నిలవడం లేదు. ఫారిన్‌ తరహాలో ఒకరితో ప్రేమాయణం సాగిస్తున్నారు. మరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు.. ఇంకొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు.. ఇలాంటి ఘటనలు వైవాహిక బంధానికి మాయని మచ్చలా మారుతున్నాయి. పచ్చని కారపురాల్లో చిచ్చు రేపుతున్నాకు. కుటుంబాలను కూలుస్తున్నాయి. పిల్లలను అనాథలను చేస్తున్నాయి. ఇద్దరి మధ్య అండర్‌ స్టాండింగ్‌ లేకపోవడం, మనస్సర్గలు, గొడవలు, తగాదాలు, ఒకరిపై ఒకరు చేయిచేసుకోవడం చివరకు చంపుకోవడం వరకు వెళుతున్నాయి. కొందరేమో విడిపోయి ఎవరి జీవితం వారు సాగిస్తున్నారు.

    కేరళలో ఇలా..
    తాజాగా కేరళతో ఈ తరహా ఘటన చోటుచేసుకుంది. భార్య విడాకులు కోరిందని, లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తుందన్న అనుమానంతో ఏకంగా ఆమె పనిచేస్తున్న ఆఫీసులో భార్యకు నిప్పంటించాడు. ఈ ఘటనలో భార్యతో పాటు మరో వ్యక్తి సజీవ దహనం అయ్యారు. తిరువనంతపురం పప్పనంకొదిలోని బీమా ఏజెన్సీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. తొలుత ఇద్దరు మహిళలే చనిపోయారని అనుకున్నారు. కానీ ఆసుపత్రికి తరలించాక.. మృతుల్లో ఓ పురుషుడు కూడా ఉన్నాడని తేలింది. అయితే అతడు ఎవరో తెలియరాలేదు. అయితే మృతుల్లో ఎక్కుబాలికులం నివాసి వైపుగా గుర్తించారు. వైప్పుతో చనిపోయిన వ్యక్తి ఎవరు. ఈ ఘటన ఎలా జరిగింది అని పోలీసులు విచారణ చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    విడాకులు తీసుకుని భర్త ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుని..
    వైపుకు గతంలో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోగా విడాకులు తీసుకుంది. మొదటి భర్‌ ఫ్రెండ్‌ బినుని ఏడేళ్ల క్రితం రెండో వివాహం చేసుకుంది. పెళ్లైన దగ్గర నుంచి భార్యా భర్తలకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో బీనుతో తన వివాహ సంబంధాన్ని తెంచుకునేందుకు వైపు కోర్టును ఆశ్రయించింది. వైపు బీమా కంపెనీలో ఆరేళ్ల నుంచి వర్క్‌ చేస్తుంది. ఉదయం ఆఫీసు తెరిచి సాయంత్ర క్లోజ్‌ చేసేది. ఆమెకు ఎన్నో కలలు ఉన్నాయి. సొంత ఇల్లు కట్టుకోవాలని, పిల్లలను బాగా చదివించాలని కోరుకునేది అయితే ఆమెకు భర్తే విలన్‌ అయ్యాడు ఆమె ఉద్యోగం చేస్తున్న చోటుకు వెళ్లి బెదిరించేవాడు. తరచూ ఫోనులో చంపేస్తానంటూ భయపెట్టేల సందేశాలు పంపేవాడు. దీంతో ఆమె భయపడి తనను ఎక్కడ చంపేస్తాడో అనే భయంతో చేతిలో పెప్పర్‌ స్ప్రే తెచ్చుకునేది

    ఆఫీస్‌కు వచ్చాక..
    మంగళవారం కూడా యధావిధిగా ఆఫీసుకు రాగా.. అక్కడ కాపు కాచిన బిను.. కార్యాలయంలోకి వెళ్లి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పొగలు రావడంతో స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి కాల్‌ చేశారు. సిసిటీవి పుటేజ్‌ బట్టి భర్తే హంతకుడని తేలింది. అతడి కోసం పోలీసులు ఎంక్వైరీ చేయగా.. ఎలాంటి ఆచూకీ దొరకలేదు. కాగా, ఈ అగ్ని ప్రమాద ఘటనలో కంపెనీకి రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్లు కంపెనీ అధికారులు చెబుతున్నారు. కాగా, బీము ఫోన్‌ కూడా స్పందించకపోవడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక పరారీలో ఉన్నాడా తెలియాల్సి ఉందంటున్నారు పోలీసులు,