Paralympics 2024 : టార్గెట్ 25 పూర్తయింది.. ఇక పై ఏ మెడల్ వచ్చినా భారత్ కు బోనసే

పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ పోటీలలో భారత అథ్లెట్లు జోరు చూపిస్తున్నారు. గత రికార్డులను బద్దలు కొట్టి.. సరికొత్త ఘనతలను సృష్టిస్తున్నారు. పారాలింపిక్స్ 25 మెడల్స్ టార్గెట్ కు పెట్టుకున్న అథ్లెట్లు.. ఆ సంఖ్యను ఎప్పుడో చేరుకున్నారు. గురువారం మరో మెడల్ భారత ఖాతాలో చేరడంతో.. ఇకపై లభించే పతకాలు మొత్తం బోనస్ అని భావించాల్సి ఉంటుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 6, 2024 2:32 pm

Paralympics 2024

Follow us on

Paralympics 2024 : పురుషుల జూడోలో 60 కేజీల జే – 1 విభాగంలో భారత అథ్లెట్ కపిల్ పర్మార్ ఏకంగా కాంస్యం దక్కించుకున్నాడు. మెడల్ పోటీలో వరల్డ్ నెంబర్ వన్ కపిల్ 10-0 తేడాతో బ్రెజిల్ దేశానికి చెందిన ఎలీల్టన్ ను ఓడగొట్టాడు. కేవలం 33 సెకండ్ లోనే అతడిని ఓడించాడు. ప్రత్యర్థి రేపు మ్యాట్ కు తాకేలా చేసి.. విజేతగా ఆవిర్భవించాడు. ఈ మ్యాచ్ లో గెలిచేందుకు కపిల్ సొటో మకి కోమి విధానాన్ని అనుసరించాడు.. కపిల్ తనకుడికాలుతో ప్రత్యర్థి ఎడమ కాలును వచ్చాడు. ఆ తర్వాత అతని పైకి లేపి రేపు కిందికి తగిలేలా ఒక్కసారిగా పడేశాడు. దీంతో నిర్వాహకులు అతడిని విజేతగా ప్రకటించారు. ఇక మహిళల 48 కిలోల జే -2 క్వార్టర్స్ లో కోకిల 0-10 తేడాతో ఓటమిపాలైంది. అనంతరం రేపి చేజ్ లోనూ ఆమె ,0-10 తేడాతో ఉక్రెయిన్ అథ్లెట్ యూలియా చేతిలో పరాజయం పాలైంది. ఆర్చరీ విభాగంలో హరివిందర్ సింగ్ -పూజ జోడి షూట్ ఆఫ్ లో 4-5 తేడాతో డెజాన్ – జివా చేతిలో ఓటమిపాలయ్యారు.

టార్గెట్ 25 పూర్తయింది..

ఇక ప్రస్తుత పారాలింపిక్స్ లో భారత్ ఏకంగా 25 మెడల్స్ సాధించింది. ఇందులో ఐదు గోల్డ్, 9 రజతాలు, 11 కాంస్య పతకాలను భారత ఆటగాళ్లు సాధించారు. పతకాల పట్టికలో భారత్ 16వ స్థానంలో కొనసాగుతోంది. చైనా 163 మెడల్స్ సాధించి తొలి స్థానంలో ఉంది. 82 మెడల్స్ తో బ్రిటన్ రెండవ స్థానాన్ని ఆక్రమించుకుంది. 77 పతకాలతో అమెరికా మూడవ స్థానంలో కొనసాగుతోంది..పారాలింపిక్స్ చరిత్రలో భారత్ తొలిసారిగా 25 పతకాలు సాధించింది. గతంలో జరిగిన టోక్యో పారాలింపిక్స్ లో భారత్ 19 మెడల్స్ దక్కించుకుంది. ఈసారి పారిస్ లో జరిగే పారాలింపిక్స్ ఏకంగా 25 మెడల్స్ సాధించాలని భారత్ నిశ్చయించుకుంది. దానికి తగ్గట్టుగానే ప్రణాళిక రూపొందించింది. ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడంలో కోచ్ లు రేయింబవళ్లు శ్రమించారు. ఇప్పుడు వాటి ఫలితమే పారిస్ పారాలింపిక్స్ లో కనిపిస్తోంది. ఆటగాళ్లు అంచనాలకు మించి రాణించడంతో పతకాల పంట పండుతోంది. టార్గెట్ 25 లక్ష్యం పూర్తి కావడంతో.. ఇకపై వచ్చే ప్రతి మెడల్ కూడా బోనస్ అని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆటగాళ్లు మరిన్ని మెడల్స్ సాధిస్తే భారత్ టాప్ -10 లో నిలవడం ఖాయమని చెబుతున్నారు. అదే గనుక నిజమైతే భారత్ సరి కొత్త చరిత్ర సృష్టించినట్టే.